నారద వర్తమాన సమాచారం
తెలంగాణ
నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..
120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణంలో, నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణం.
ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు అద్భుత బోటు ప్రయాణాన్ని కార్తీక మాసం తొలిరోజు నిన్న పర్యాటకశాఖ ప్రారంభించింది.
ప్రస్తుత వర్షాకాల సీజన్లో విస్తృతస్థాయిలో వర్షాలు పడడం వల్ల కృష్ణానది తీరం వెంట, అటు శ్రీశైలం నుండి ఇటు నాగార్జున సాగర్ డ్యాం వరకు గరిష్ట మట్టంలో నీటి లభ్యత ఉండటం వల్ల రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిన్న నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు ఈ బోట్ (లాంచ్ ) ప్రయాణాన్ని ప్రారంభించింది…..