నారద వర్తమాన సమాచారం
కాకినాడ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు,నేరాలు పై పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు
అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలి
క్రిమినల్స్ కు లం మతం ఉండదనీ, తెగేదాకా లాగితే బాగుండదని వ్యాఖ్యానించారు
ఇళ్లల్లోకి వెళ్లి మహిళలను అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు
తాను హోం శాఖను తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారు
రాష్ట్రం లో శాంతి భద్రతలను బలంగా అమలు చేయాలని పోలీసులకు పదేపదే చెప్పాను
కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ హైస్కూల్లో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రం లో జరుగుతున్న నేరాలు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు,ఈ సందర్భంగా
పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు…
క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదనీ,నేరాలు నియంత్రణ చేయాలని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలని,అత్యాచార నిందితుల అరెస్ట్‌కు కులం అడ్డువస్తోందా అని,
క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోందనీ రాష్ట్రం లో అధికారులకు, ఎస్పీలకు ఇదే తన హెచ్చరిక అని శాంతిభద్రతలు కీలకమైనవనీ పవన్ కల్యాణ్ తెలిపారు..
అలాగే అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలనీ
నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది-పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు …
Discover more from
Subscribe to get the latest posts sent to your email.