నారద వర్తమాన సమాచారం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మానస పుత్రిక ఈ డ్వాక్రా సంఘాలు.
ప్రతి సభ్యురాలిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వ లక్ష్యం – ప్రత్తిపాటి పుల్లారావు
దేశంలోనే ఒక ఉద్యమంలా డ్వాక్రా సంఘాలను చైతన్యవంతం చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, వారి మానస పుత్రిక అయిన ఈ డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేసే క్రమంలోనే,డ్వాక్రా సంఘ సభ్యులకు ఈ ఒక రోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యడ్లపాడు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం నందు డిఆర్డిఏ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాపారవేత్తలుగా డ్వాక్రా మహిళలను చేసే ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలపై ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడటం జరిగింది.3 మండలాల పరిధిలో 42,000 మంది మహిళలు ఈ డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్నారని, వారందరూ ఈ శిక్షణా కార్యక్రమాలలో పాల్గొని, షూరిటీ లేని రుణాల ద్వారా స్వయం సమృద్ధిని సాధించాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. ఒక్క ఎన్పీఏ ఖాతా కూడా లేకుండా నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాలు ఉన్నాయని లీడ్ బ్యాంక్ మేనేజర్ రాం ప్రసాద్ తెలియజేయడం తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని, ఎక్కడా కూడా లీడర్లు, వి వో ఏ, సీసీ లు అవకతవకలకు పాల్పడకుండా పని చేయాలని పిలుపునిచ్చారు.గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఇర్లపాడు,నాదెండ్ల, సాతులూరు, గణపవరం, కావూరు, యడ్లపాడు, తిమ్మాపురం, సందెపూడి గ్రామాలలో పలు అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని, ఎంతటి వారినైనా డ్వాక్రా మహిళలకు అన్యాయం చేస్తే సహించను అని శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.992 డ్వాక్రా సంఘాలకు 70 కోట్ల 80 లక్షల రూపాయల చెక్కును అందించటం జరిగింది.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పిడి బాలు నాయక్, డి పి ఎం ఎల్ హెచ్ సి హెచ్ శ్రీనివాస్, వెలుగు సిబ్బంది, ఏ పి యం, సి సి లు మరియు జనసేన నియోజకవర్గ ఇన్చార్జి తోట రాజా రమేష్,3 మండలాల అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్, బండారుపల్లి సత్యం, కామినేని సాయి బాబు తదితరులు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.