నారద వర్తమాన సమాచారం
దొంగతనం కేసుల్లో అంతర్ జిల్లా దొంగల అరెస్టు
150 కి పైగా దొంగతనం కేసులో ఉన్న ముద్దాయిలను అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు
ముద్దాయిల వద్ద నుంచి పది లక్షల విలువ చేసే బంగారం, వెండి, ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు
కేసును లో ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకొని త్వరితగతిన దర్యాప్తు చేసి ముద్దాయిలను అరెస్టు చేసిన రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ ను అభినందించిన డిఎస్పి మురళీకృష్ణ
తాళాలు వేసి ఉన్న ఇల్లు ఉంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలు
నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళి కృష్ణ
నేర నియంత్రణలో నిఘా నేత్రాలు ఎంతో ముఖ్యమైనవని నేరాలను గుర్తించడంలో నిఘా నేత్రాలు పాత్ర చాలా ముఖ్యమైనదని దొంగతనాలు, ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిఘా నేత్రాల ద్వారా దోషులను గుర్తించడంలో ఉపయోగకరంగా ఉంటుందని, మంగళగిరి ఎర్రబాలెం, నవులూరు, గ్రామంలో జరిగిన వరుస దొంగతనాలు నిఘా నేత్రాల ద్వారా మంగళగిరి రూరల్ పోలీసులు చేదించారని మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ అన్నారు. శుక్రవారం మంగళగిరి రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి రూరల్ ప్రాంతాలలో పలుచోట్ల దొంగతనాలు జరిగినట్లు ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పలు ఇళ్లల్లో ఇంటి తాళాలు గుణపాలతో పగలగొట్టి డబ్బు బంగారం వెండి వస్తువులు దొంగలించినట్లు గుర్తించడం అయినదని డిఎస్పి మురళి కృష్ణ తెలిపారు.అంతర్ జిల్లా దొంగ తోట శివకుమార్ అనే వ్యక్తిని అతనికి సహకరించిన ఇమిడి నాగేశ్వరావు పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పది లక్షల విలువచేసే బంగారం వెండి ఆభరణాలు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి మురళీకృష్ణ మీడియాకు తెలిపారు. వరుస దొంగతనాల ఘటనలపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్నారని ఆయన అన్నారు. రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ముద్దాయిలను విచారించగా వారు నేరం చేసినట్లు అంగీకరించారని ఆయన తెలిపారు. ఇద్దరు ముద్దాయిలపై రాష్ట్రంలో సుమారుగా 150 పైగా కేసులు ఉన్నట్లు, గత కొన్ని రోజుల క్రితం జైలు నుండి విడుదలై నేరాలకు నేరాలకు పాల్పడుతున్నారని గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి తెలిపారు. ముద్దాయిల నుండి దొంగలించిన బంగారము వెండి వస్తువులు బైక్ మరియు నేరం చేయడానికి ఉపయోగించిన నాలుగు ఇనప రాడ్లు ఒక స్కూ డ్రైవర్ ను స్వాధీన పరుచుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ముద్దాయిల నుండి రికవరీ చేసిన సొత్తు, 90 గ్రాముల బంగారం వస్తువులు, 2.5 కేజీల వెండి వస్తువులు, రెండు గోల్డ్ కవరింగ్ రిస్ట్ వాచెస్, ద్విచక్ర వాహనము, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలను న్యాయస్థానం ముందు హాజరు పరుస్తున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు,ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ కు డీఎస్పీ మురళీకృష్ణ రివార్డ్ లను అందజేశారు.అలాగే పలువురు పోలీస్ సిబ్బందికి, కానిస్టేబుల్ డి శ్యామ్ కు రివార్డులను డీఎస్పీ మురళీకృష్ణ అందజేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రజలు ఊర్లకు ఫంక్షన్లకు వెళ్లేప్పుడు ఇంటి చుట్టుపక్కల వారికి తెలియజేయాలని అదేవిధంగా ఎల్ హెచ్ ఎం ఎస్ వినియోగించుకోవలసిందిగా డీఎస్పీ మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. అలాగే వ్యాపార సముదాయాల వద్ద గ్రామ కూడలిలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన డి.ఎస్.పి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామాలలో అనుమానస్పదంగా ఎవరైనా తిరుగుతున్నాయి ఎడల వెంటనే పోలీసువారికి సమాచారం ఇవ్వవలసిందిగా ఆయన తెలిపారు. కేసులో ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకొని త్వరితగతిన దర్యాప్తు చేసిన, దర్యాప్తు అధికారి అయిన రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ ను,పోలీస్ సిబ్బందిని అభినందించిన డిఎస్పి మురళీకృష్ణ,
Discover more from
Subscribe to get the latest posts sent to your email.