నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…..
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు నరసరావు పేట డి.ఎస్.పి K.నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన దొంగలను పట్టుకోవడం జరిగింది
ది.08.11.2024 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో నరసరావు పేట మండలం కేశానుపల్లి గ్రామ పంచాయితీ లోని SRKT బైపాస్ వద్ద నరసరావు పేట రూరల్ ఎస్సై మరియు వారి సిబ్బంది ముద్దాయి లను పట్టుకోవడం జరిగింది.
ఈ ముద్దాయిలు ఇళ్ళ ముందు,బార్ ల ముందు పార్క్ చేసిన వాహనాలను దొంగలించడం చేసారు.అలా దొంగలించబడిన 29 ద్విచక్ర వాహనాలను రికవరీ చెయ్యడం జరిగింది.వాటి విలువ సుమారు 16,00,000/-
పట్టుబడిన ముగ్గురు ముద్దాయి లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.
పల్నాడు జిల్లాలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని,
నరసరావు పేట పట్టణం లో గంజాయి,మెడికల్ మాఫీయా,పెస్టిసైడ్ మాఫీయా,పాలల్లో కల్తీ వంటి వాటి పై పోలీసులు దాడులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం అందించిన ప్రజల వివరాలు గోప్యంగా ఉంచుతామని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన వారిపై నిరంతరనిగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
వాహన దొంగలను పట్టుకొనిన నరసరావు పేట రూరల్ సిఐ,ఎస్ఐ మరియు పోలీసు సిబ్బందిని శఎస్పీ అభినందించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.