నారద వర్తమాన సమాచారం
ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలి:: ఏపీజీఈఏ క్రోసూర్ తాలూకా యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు శాంసన్ రత్తయ్య
రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటించి 12వ పిఆర్సి కమీషన్ ను నియమించాలని పల్నాడు జిల్లా క్రోసూరు తాలూకా యూనిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శిఖా శాంసన్, కార్యదర్శి బండి రత్తయ్యలు మంగళవారం క్రోసూరు లోని ఎస్సీ వసతి గృహంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా పరిష్కారం కానీ ఆర్థిక, ఆర్థిక సంబంధం కానీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు పదేళ్లుగా ఉపయోగం లేకుండా ఉన్న ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సర్దుబాటు పేరుతో ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 143 మరియు జీవో నెంబర్ 32 లను సవరించాలన్నారు 12వ పిఆర్సికి కమిషనర్ను నియమించాలని ఇప్పటికే ఆలస్యం 35 శాతం మధ్యంతర మృతిని చెల్లించాలని డిఏ, సరెండర్ లీవు, జిపిఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ హెచ్ ఎస్ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కోసం ప్రతి నెల మా జీతాల్లో పెన్షనల్లో డబ్బులు రికవరీ చేసుకొని కూడా ఎవరికి ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీము లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీము ప్రధాన ఉద్దేశం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగి పెన్షనర్లకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగునులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్ ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సమానంగా రెండు సంవత్సరాలు పెంచాలన్నారు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు అక్టోబర్ నెలలో కోత విధించిన జీతాలను తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఉద్యోగులు సమయంతో పని లేకుండా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాల్సిన వైద్య ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది జీతాలకు ఎఫ్ ఆర్ ఎస్ ఫేషియల్ రెకగ్నేషన్ అటెండెన్స్ సిస్టముకు లింకు పెట్టటం అన్యాయమని, సాంకేతిక సమస్యలు లోపాలు ఉన్న ఎఫ్ ఆర్ ఎస్ హాజరుతో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు అక్టోబర్ నెలలో కోత విధించిన వేతనాలను వెంటనే తిరిగి చెల్లించాలని వారి డిమాండ్ చేశారు ఒక గర్భిణీ స్త్రీ నొప్పులు పడుతుంటే ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఆ బాధితురాలితో కలిసి రాత్రి అయిన పగులైన సమయంతో సంబంధం లేకుండా ఆసుపత్రికి తీసుకొని వెళ్లాల్సి రావటం, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కేసులకు వెళ్ళటం, ఒక గ్రామంలో వాంతులు, విరోచనాలు, లేదా జరాలు లాంటి ఎపిడిమిక్స్ వచ్చినప్పుడు రాత్రి పగలు, వైద్య ఆరోగ్యశాఖలో నిర్విరామంగా పని చేయవలసి వస్తుందని తెలిపారు కాబట్టి వైద్య ఆరోగ్య శాఖలోని ఫీల్డ్ స్టాప్ సిబ్బందికి ఎఫ్ ఆర్ ఎస్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా చూడాలని కోరారు ఎఫ్ ఆర్ ఎస్ విధానంలో మొబైల్ డివైడర్లను ప్రభుత్వం సరఫరా చేయకుండా నెట్వర్క్ సరిగా లేకపోయినా సొంత మొబైల్ ఫోన్ నుంచి ఎఫ్ ఆర్ ఎస్ వేస్తున్నారన్నారు ప్రతి పీహెచ్సీలో నలుగురు స్టాఫ్ నర్స్ ల ను నియమించాలని ప్రతి పీహెచ్సీలో రిపోర్టులు తయారీకి ఆన్ వర్క్ డేటా ఎంట్రీ పనులకు డిఇఓ లను డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని, ఎఫ్ టి ఏ 22 11 హెడ్ కి మూడు సంవత్సరములు బకాయిలను విడుదల చేయవలసిందిగా వారి కోరారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.