నారద వర్తమాన సమాచారం
స్థానిక మరియు పిరియాడికల్ (వార, పక్ష, మాస) పత్రికలకు ప్రభుత్వం చేయూతనివ్వాలని రాష్ట్ర సమాచారం మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి ని కలిసిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్……
విజయవాడ:-
ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు ఆధ్వర్యంలో కృష్ణ, గుంటూరు, పల్నాడు జిల్లాల నాయకులు బుధవారం ఉదయం మంత్రివర్యులను ఆయన స్వగృహం వద్ద కలిసి
పిరియాడికల్ మరియు స్థానిక పత్రికల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు
ముఖ్యంగా సీనియర్ సంపాదకులకు పెన్షన్ సౌకర్యము కల్పించాలని కోరారు
అలాగే స్థానిక పత్రికలకు అక్రిడేషన్లు ఇచ్చే విషయంలో రూల్స్ ను సరళీకృతం చేయాలని
పిరియాడికల్ పత్రికల సంపాదకులకు కమిటీలలో స్థానం కల్పించాలని
దిన వార పక్ష మాస పత్రికలకు
పెద్ద పత్రికలకు ఇస్తున్నట్లుగా రెగ్యులర్ ప్రకటనలు ఇవ్వాలని
2024 జనవరి 1న స్థానిక పత్రికలకు ఇచ్చిన ప్రకటనల తాలూకా బిల్లులను వెంటనే చెల్లించాలని
2025 జనవరి ఒకటికి గతంలో లాగా స్థానిక పత్రికలకు ప్రకటనలను మంజూరు చేయాలని కోరారు
అక్రిడేషన్ల మంజూరు, ప్రకటనల విడుదల తదితర అంశాలలో స్థానిక మరియు పిరియాడికల్ పత్రికలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు
ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ నాయకులు ప్రతిపాదించిన అంశాలన్నిటిని పరిగణంలోకి తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు
యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాగర్ బాబు కోశాధికారి కోటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసాచారి, కృష్ణ ప్రసాద్,నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు,, అశోకు, మరియు గుంటూరు జిల్లా సెక్రెటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాంబశివ నాయుడు
శ్రీనివాసాచారి మంత్రిని సత్కరించి జ్ఞాపికను మరియు వినతి పత్రాన్ని అందజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.