నారద వర్తమాన సమాచారం
ఎన్ సి డి 3.0 సర్వే కార్యక్రమం పరిశీలన
ముందస్తు జాగ్రత్తలు, పరీక్షల ద్వారా క్యాన్సర్ ను నివారించేందుకు అందరూ సహకరించాలి
వైద్య అధికారిని సిరి చందన
ప్రజల ఆరోగ్యంపై ఈ నెల 14 నుంచి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గూర్చి ఇంటింటా సర్వే చేపడుతున్నట్లు పల్నాడు జిల్లా కోసూరు మండలం వైద్యాధికారిణి సిరి చందన గురువారం అన్నారు దొడ్లేరులో జరుగుతున్న ఎన్ సి డి సర్వేను ఆమె పరిశీలించారు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధులు కాకుండా తమ దుర అలవాట్లు ద్వారా వచ్చే జబ్బులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రజల జీవన పరిమాణం పెంచటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజారోగ్యంపై దృష్టి నిలిపాయ అన్నారు సుమారు 50 ప్రశ్నావళితో సర్వే జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు ఈ సర్వేలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ద్వారా ప్రతి గృహంలో నివసిస్తున్న 18 సంవత్సరములు పైబడిన స్త్రీ, పురుషులకు బిపి షుగర్ హిమోగ్లోబిన్, నోరు, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, 30 సంవత్సరాలు పైబడి వివాహమైన స్త్రీలు అందరికీ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ఏమైనా అనుమానిత కేసులు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రిఫరల్ చేస్తామన్నారు క్యాన్సర్ నుండి రక్షణ పొందాలంటే ముందస్తు పరీక్షల ద్వారానే క్యాన్సర్ పై విజయం సాధిస్తామని తెలిపారు ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాటులతోనూ ప్రస్తుతం ఉన్న జీవనశైలి విధానం వలన శారీరక, మానసిక, సామాజిక ఒత్తిడిలతో రక్తపోటు, షుగర్ జబ్బులతో ప్రజలు బాధపడుతున్నారన్నారు మధ్య వయసులలో చాలామంది సడన్గా కార్డియాక్ అరెస్టు ద్వారా చనిపోతున్నారు అన్నారు కాబట్టి జంక్ ఫుడ్ ఆహారపు అలవాట్లు పాన్ పరాక్, ఆల్కహాల్, పొగాకు సంబంధించిన చెడు అలవాట్లు పై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి తెలియజేశారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ప్రజలను మంచి ఆరోగ్యంపై చైతన్య పరచటం ముఖ్యమన్నారు ఎలాంటి భోజనం తీసుకుంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందో అవగాహన కల్పించాలన్నారు ఈనెల 16వ తేదీ మండల వ్యాప్తంగా రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల లోపు విద్యార్థులకు అంగన్వాడి సెంటర్ లో ఒకటి నుండి 5వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్లో ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య సిబ్బందిచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్య రికార్డులు అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ధన రేఖ ఆరోగ్య కార్యకర్త కోటేశ్వరమ్మ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.