Thursday, November 21, 2024

మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా జన సేన అధ్యక్షులు, ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నారద వర్తమాన సమాచారం

మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా జన సేన అధ్యక్షులు, ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ డేగ్లూరు నుంచి ప్రచారాన్ని శనివారం ఉదయం ప్రారంభించారు.

మహారాష్ర్ట ఎన్నికల ప్రచారంలో భాగంగా డేగ్లూర్ సభలో జన సేన అధ్యక్షులు, ఆంధ్ర రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ప్రసంగించారు.

నేను ఇక్కడికి కేవలం ఓట్లు అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన నేల, ఎందరో సాధువులు నడిచిన నేల, మహానుభావులు ఉన్న నేల మీద గౌరవం తెలపడానికి వచ్చాను.చత్రపతి శివాజీ పుట్టిన నేల.. మన హక్కుల మీద పోరాటం నేర్పిన నేల మీద గౌరవం తెలపడానికి వచ్చాను.. స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన నేలపై నాకున్న గౌరవం తెలపడానికి వచ్చాను.

చత్రపతి శివాజీ పుట్టిన నేల.. మన హక్కుల మీద పోరాటం నేర్పిన నేల మీద గౌరవం తెలపడానికి వచ్చాను.. స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన నేలపై నాకున్న గౌరవం తెలపడానికి వచ్చాను.

బాబా సాహెబ్ అంబేద్కర్ కర్మ భూమిగా నిలచిన గొప్ప భూమిపై గౌరవం తెలపడానికి వచ్చాను. రాజ మాత జీజీయా భాయ్ నేర్పిన విలువలతో ఈ నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను.

మరాఠాలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. మాట్లాడేప్పుడు తప్పులు ఉంటే క్షమించండి.

బాలా సాహెబ్ ఠాక్రేను జీవించి ఉండగా కలిసే అవకాశం రాలేదు. అన్యాయాలు, అక్రమాలు ఎదిరించడంలో ఆయన నాకు బలమైన స్ఫూర్తి. సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో ఆయన నాకు స్ఫూర్తి. జనసేన ఏడు సిద్దాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ స్ఫూర్తి. ఏ విషయాన్ని అయినా ధైర్యంగా చెప్పడం.. నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం. అధికారంతో సంబంధం లేకుండా మన సిద్దాంతాలకు బలంగా కట్టుబడి ఉండడం బాలా సాహెబ్ ఠాక్రే నుంచి నేర్చుకున్నాను.

గడచిన పదేళ్లుగా దేశంలో ఎన్డీఏ పాలనను గమనిస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ కనబడుతుంది. దివ్య రామమందిరంతో అలంకరించిన ఆయోధ్య కనబడుతుంది. ప్రపంచ పటంపై.. తిరంగా రెపరెపలాడుతూ కనబడుతోంది.

ఎన్డీఏ పాలనలో దేశ నలూములలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి. పల్లెపల్లెకు విస్తరించిన రోడ్లు కనబడుతోంది.

గడచిన పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల మంది భారతీయలను పేదరికం నుంచి విముక్తి చేసింది. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ది చేకూరింది. ముద్ర యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూత ఇచ్చింది.

గత పదేళ్లలో హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు 11 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి థానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ది మహామార్గాన్ని నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం.

2028 లోపు మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారత దేశాన్ని ఐదు లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలకపాత్ర పోషించబోతోంది.

ఇలాంటి తరుణంలో డేగ్లూర్ నియోజకర్గ అభివృద్ధి చాలా కీలకం. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ విశ్రాంతి గృహం, డేగ్లూర్, బిలోమీ పోలీస్ స్టేషన్లు, కోర్టుల నిర్మాణం, హేమంత్ పంత్ ఆలయ నిర్మాణం, కుందల్ వాడీ బేవలీ రోడ్డు మార్గం నిర్మాణం పూర్తి చేసింది.

హర్ ఘర్ జల్ యోజన కింద 50 శాతం పనులు పూర్తయ్యాయి. డేగ్లూర్ నియోజకవర్గంతో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే, మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలి. మీ కలలన్నీ సాకారం కావాలి అంటే ఎన్డీఏకు డేగ్లూర్ యువత, ఆడబిడ్డలు ప్రజల మద్దతు కావాలి.

మహారాష్ట్ర చరిత్రను చూస్తే ఎంతో మంది సనాతన ధర్మాన్ని రక్షించేందుకు కృషి చేశారు. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో పాల్గర్ లో సాధువులు వేడుకున్నా వదలకుండా చంపేశారు. విశాల్ ఘడ్ చారిత్రక ఖిల్లాను ఆక్రమించారు. ఒక వర్గం ప్రజలను శాంతింపచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

మనకి కావాల్సింది ఇలాంటి ప్రభుత్వాలు కాదు. సాధువుల్ని, సంతవుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం మనకు కావాలి.

మహారాష్ట్ర వ్యాప్తంగా చత్రపతి శివాజీ మహారాజ్ పోరాడిన దుర్గాలన్నీ దక్షిణ భారతాన్ని హిమాలయ పర్వతంలా కాపాడాయి. ఆక్రమణ దారుల్ని రానివ్వకుండా చేశాయి. దీంతో దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి నేను మహారాష్ట్ర నేల, వీరులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. విశాల్ ఘఢ్ ఖిల్లా అన్యాక్రాంతం అయిపోయింది. ఆక్రమణదారులు కైవసం చేసుకున్నారు. చత్రపతి శివాజీ పోరాడింది వీరి మీదే. ఇప్పుడు మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం. దేశాన్ని రక్షించుకోవాలంటే ఆ నిర్ణయం మీచేతుల్లో ఉంది. విడిపోయి బలహీనపడదామా? కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి అస్థిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా కలసి బంగారు భవిష్యత్తు నిర్మిద్దామా? విడిపోయి అరాచకతత్వానికి స్థానం కలిపిద్దామా? కలిసి అభివృద్ధి, సంక్షేమం వైపు పయనిద్దామా? ప్రాంతాలను దాటి సనాతన ధర్మం ఉండే నేల ఇది.

ప్రజల హక్కుల గురించి, వాటి శక్తుల గురించి రామ్ ధారీ సింగ్ దినకర్ గారి మాటల్లో చెబుతాను. ప్రజలంతా కలిసి కట్టుగా ఒక్కసారి ఊపిరి తీస్తే దేన్నయినా ఎదుర్కొగలరు. బలంగా నీ శ్వాస వదిలితే తలలకు పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి. అదే మహారాష్ట్ర నేల చెప్పింది.

దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి కొంత మంది వచ్చి మాకు 15 నిమిషాలు ఇవ్వండి అని కథలు చెప్ప్తారు. పాత బస్తీలో కూర్చుని పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం అంటారు. ఇది చత్రపతి శివాజీ పుట్టిన నేల, మా సహనం పరీక్షించకండి.

సినిమాల్లో పోరాటం చేయడం గొడవపడడం తేలిక. నిజ జీవితంలో ధర్మం కోసం నిలబడడం, గొడవ పెట్టుకోవడం చాలా కష్టం. సనాతన ధర్మం చాలా బలమైన ధర్మం. సినిమాలు కేవలం ఆనందం మాత్రమే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం మరాఠా భాష, సంస్కృతి కోసం మనమంతా కలసి పని చేయాలి. నేను మీ ముందుకు వచ్చి అడుగుతున్నాను. నాందేడ్ లోక్ సభ, డేగ్లూర్ అసెంబ్లీలకు పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్ధులకు అఖండ విజయం ఇవ్వండి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading