నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్
పల్నాడు జిల్లాలోని పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేయుచున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్
ఈ రోజు మధ్యాహ్నం నుండి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులను, సిబ్బంది పనితీరును పరిశీలిస్తున్న ఎస్పి శ్రీ కంచి శ్రీనివాసరావు
పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలలో భాగంగా వెల్దుర్తి, మాచర్ల టౌన్, మాచర్ల రూరల్, దుర్గి పోలీస్ స్టేషన్లో తనిఖీ చేయుచున్నారు.
పోలీస్ స్టేషన్ల ను తనిఖీ చేయుచు రిసెప్షన్ నందు వచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ లను తనిఖీ చేయుచున్నారు.
లాకప్ మరియు స్టేషన్ పరిసరాలు తనిఖీ చేయుచున్నారు. అనుమతి లేకుండా లాకప్ నందు ఎవరిని ఉంచవద్దని ఎస్పీ స్టేషన్ అధికారులకు తెలిపారు.
అదేవిధంగా స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.
అదేవిధంగా రిసెప్షన్ లో ఉన్నటువంటి సిబ్బంది పనితీరును మరియు వారు చేస్తున్నటువంటి విధులకు సంబంధించి ఏ విధంగా చేయుచున్నారో వారిని అడగడం జరిగింది.
రాత్రి పూట గస్తీ ముమ్మరం గా జరిగేటట్లు చూడవలసిందిగా స్టేషన్ అధికారులకు తెలియజేశారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక, గంజాయి మొదలైన నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, నిల్వలుపై దృష్టి సారించాలని సూచించారు.
దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,
విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ మహిళలపై జరుగుతున్న నేరాల అరికట్టడంపై దృష్టి పెట్టి, వాటిని అరికట్టాలనీ, తెలిపారు.
అంతేకాకుండా సైబర్ నేరాల పై,గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఫోక్సో నేరాలపై విస్తృతంగా అవగాహన కలిగించాలని ప్రత్యేకంగా ఆదేశించినారు.
పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఫ్యాక్షన్ గ్రామాలు మరియు పోలీస్ పికెట్ లు ఉన్న గ్రామాల గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఫ్యాక్షన్ గ్రామాల విషయంలో తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ ల పరిధిలో జరుగనున్న తిరునాళ్ళు గురించి తిరునాళ్ళ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి స్టేషన్ అధికారులకు తెలియజేశారు.
పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యొక్క యోగక్షేమాల విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందే వ్యవస్థకు వెన్నెముక అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు యస్.బి సిఐ బండారు సురేష్ బాబు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.