నారద వర్తమానం సమాచారం
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్‌కు నోటీసులు
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు
ఈ ఉదయం విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేత
ఇదివరకే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు
ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తూ నోటీసులు ఇస్తున్న పోలీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీచేశారు. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ఆయన ఈ ఉదయం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా, ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న వెంటనే జైపాల్ యాదవ్ విచారణకు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తున్న పోలీసులు అందులోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.