నారద వర్తమాన సమాచారం
ఎస్‌ఎస్‌ఎన్ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియం, పల్నాడు జిల్లా.
పల్నాడు జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో సమాజ సంక్షేమం కోసం: సైబర్ నేరాలపై అవగాహన, డ్రగ్స్, ర్యాగింగ్ & ఆత్మహత్యలు అనే అంశంపై అవగాహన సదస్సు కార్యక్రమానికి హాజరై కళాశాల యాజమాన్యానికి తగు సూచనలు చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్.
కార్యక్రమ ముఖ్యాంశాలు :
కార్యక్రమంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ దుర్వినియోగం, ర్యాగింగ్, మరియు ఆత్మహత్యల వంటి సమాజ సమస్యలపై విశ్లేషణతో కూడిన చర్చలు జరిగాయి.
కార్యక్రమ విశేషాలు :
సైబర్ నేరాల అవగాహన: ఫిషింగ్, హ్యాకింగ్, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి సమకాలీన సవాళ్లపై వివరాలు మరియు నివారణ చర్యలు చర్చించబడ్డాయి.
డ్రగ్స్ ముప్పు: యువతలో డ్రగ్ దుర్వినియోగం ప్రభావాలు, చట్టపరమైన చర్యలు, మరియు పునరావాస కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వబడింది. టీనేజి పిల్లలు డ్రగ్స్ మరియు గంజాయి కు అలవాటు పడినట్లయితే వారికి డ్రగ్స్ అందుబాటు లోకి రాకపోతే వారు ఏదైనా చెయ్యడానికి సిద్దమవుతున్నారు.
ర్యాగింగ్ నిరోధక చర్యలు: విద్యాసంస్థల్లో భద్రతా ప్రణాళికలు, మరియు ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా అమలు జరుగుతున్న చట్టాలు గురించి వివరించారు.
ఆత్మహత్య నివారణ: విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ధోరణుల సంకేతాలు గుర్తించడం, మరియు హెల్ప్‌లైన్ సేవల ప్రాముఖ్యతపై చర్చించారు. ఆత్మహత్యలు నివారించడానికి ఉపాధ్యాయులు తప్పని సరిగా విద్యార్ధుల నడవడికను తప్పనిసరిగా గమనించాలని తెలిపారు. ఈ మధ్య కాలంలో కాలేజీ నందు అమ్మాయి ఆత్మహత్య బాధాకరం.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా లోని అన్ని జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
ముఖ్య సందేశం
ఈ కార్యక్రమం విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, భద్రత మరియు క్రమశిక్షణ కలిగించడంలో ముఖ్య పాత్ర పోషించడానికి ఉద్దేశించబడింది. పోలీసు అధికారులు, విద్యాశాఖ అధికారులు మరియు సమాజం కలిసి, సైబర్ నేరాలు, డ్రగ్స్, ర్యాగింగ్ మరియు ఆత్మహత్యల వంటి సమస్యలను ఎదుర్కోవడంపై ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమాజ సంక్షేమానికి అందరి భాగస్వామ్యం అవసరం అని యస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవనీయులు
శ్రీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ (పోలీసు సూపరింటెండెంట్, పల్నాడు)
శ్రీ జే వి సంతోష్ ,
అడిషినల్ ఎస్‌పి (అడిషినల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు , పల్నాడు)
. శ్రీమతి ఎం. నీలావతి దేవి
(డీఐఈవో, పల్నాడు జిల్లా)
. శ్రీ కె. నాగేశ్వరరావు (ఎస్‌డీపీవో, నరసరావుపేట)
శ్రీ ఎం.హనుమంత రావు (ఎస్‌డీపీవో, సత్తెనపల్లి)
పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పోలీస్ శాఖ.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.