నారద వర్తమాన సమాచారం
ఎస్ బి ఐ నుంచి మరో 500 బ్రాంచీలు: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్
హైదరాబాద్:
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువవనున్నాయి.
మారు మూల గ్రామాలకు సైతం బ్యాంకింగ్ సేవలు విస్తరించేందుకు ఎస్బీఐ తగిన చర్యలు తీసుకుం టోంది. ఇందులో భాగంగానే మరింత మంది బ్యాంకింగ్ సేవలు విస్తరించేందుకు ఈ ఆర్థిక ఏడాది 2024-25 నాటికి కొత్త 500 బ్రాంచీలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు.
ఎస్‌బీఐ ముంబై ప్రధాన కార్యాలయ భవనం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు. బ్యాంకింగ్ ఎకోసిస్టమ్ వృద్ధికి, పీఎస్‌యూ బ్యాంకింగ్ వృద్ధికి ఎస్‌బీఐ ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రశంసలు కురిపించారు.
‘ఈ ఆర్థిక ఏడాది 2025లో 500 కొత్త శాఖలు తెరవబోతున్నామని ప్రకటించింది,ప్రస్తుతం ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 2300 బ్రాంచీలు, 6580 ఏటీఎంలు, 85 వేల బ్యాంకింగ్ కరస్పాండెన్స్ ఉన్నాయి.
అలాగే బ్యాంక్ డిపాజిట్లు 22.4 శాతం, అడ్వాన్సులు 19 శాతం, 50 కోట్లకుపైగా కస్టమర్లు, 25 శాతం డెబిట్ కార్డ్ ఖర్చు, మొబైల్ బ్యాంకిం లావాదేవీల్లో 22 శాతం, బ్యాంకులో 25 శాతం యూపీఐ లావాదేవీలు, 29 శాతం ఏటీఎం ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి.
డిజిటల్ టెక్నాలజీని బ్యాంక్ చాలా వేగంగా అందిపుచ్చుకోవడం ప్రశంసనీయం. దేశంలోని అన్నిప్రాంతాల్లోని బ్రాంచీలకు డిజిటల్ సౌకర్యాలు కల్పించడంలో సమానమైన అవకాశాలు కల్పిస్తున్నారు’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.