నారద వర్తమాన సమాచారం
అమెజాన్ అడవుల్లో ఉండే లక్షలాది మంది ప్రజలు ఆకస్మాత్తుగా ఎలా మాయం అయిపోయారు?
అమెజాన్ మహారాణ్యం.
మన అందరికి తెలిసి ఇది భూమి మీద ఉన్న గొప్ప అరణ్యాలలో ఒకటి, ఇది ఎన్నో అద్భుతలాకి నిలయం అలాగే చాలా ప్రమాదం కూడా. శతాబ్దాలుగా అమెజాన్ గురించి కొన్ని కధలు చెలామణిలో ఉన్నాయి, అదేం అంటే అమెజాన్ అడవులలో ఒకానొక సమయంలో గొప్ప నగరాలు ఉనికిలో ఉండేవట.
ఆ నాగరాలల్లో నివసించే ప్రజలు దగ్గర చాలా బంగారం ఉండేదట. వాళ్ళ దగ్గర బంగారం ఎంతల ఉండేది అంటే వాళ్ళు వాడే వస్తువులు కూడా బంగారంతో చేసినవే అని చాలామంది నమ్మేవాళ్ళు. ఇందులో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ఈ వార్తలే, చాలామంది అటవీకుల ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాయి.
ఈ అమాయక అటవీకులదగ్గర నుండి బంగారాన్ని దోపిడీ చేసేందుకు కాను, కొన్ని దేశాలు అన్వేషణ అనే పేరుతో ప్రత్యేక బృందలను ఈ అమెజాన్ అడవులకు పంపాయి.
కథలు ప్రకారం అమెజాన్ అడవిలో చాలా నగరాలు ఉన్నా కూడా ఎల్ డోరాడో, లాస్ట్ సిటీ ఆఫ్ Z అనేవి మాత్రం చాలా ఫేమస్. ఎందుకంటే ఈ నగరాల్లో ఈ ప్రజల దగ్గర బంగారం చాలా పెద్ద మొత్తంలో ఉంది అని నమ్మేవారు.
ఎల్ డొరాడో అనే బంగారు నగరం గురించి మనలో చాలామందికి తెలుసు కదా అది కూడా ఇక్కడే ఉంది అని అంటారు. అన్వేషకులను ఈ కథలు ఆకర్షించాయి. దాంతో చాలామంది స్పానిష్, యూరోపియన్ అన్వేషకులు ఆ నగరాల కోసం అమెజాన్ అడవుల్లోకి వెళ్లి వెతికారు.
వారిలో కొందరు మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడ వెళ్లి వెతికితే వాళ్ళకు కొన్ని ఆటవీకుల తెగలు తప్ప గొప్ప ఆ బంగారు నగరాలు ఏమీ కనపడలేదు.
దాంతో ఎల్ డోరాడో,లాస్ట్ సిటీ ఆఫ్ Z వంటి బంగారు నగరాలు ఒట్టి కట్టు కథలు అని కొట్టి పడేసారు.
మొదటిసారిగా అమెజాన్లో నగరాలు ఉన్నాయి అని ప్రపంచానికి ఎలా తెలిసింది?
Francisco de Orellana, అనే స్పానిష్ సాహసికుడు అమెజాన్ నదిని అన్వేషించిన మొదటి అన్వేషకుడు. ఇతను 1538 పెరూలో గ్వాయాక్విల్ ప్రాంతానికి గవర్నర్‌గా నియమించబడ్డాడు.
Francisco Pizarro ( inka సామ్రాజ్యాన్ని కనుగొన్న స్పానిష్ ఆక్రమణాదారుడు ఇతనే పెరు లోని లిమా నగరాన్ని కనుగొన్నది) ఇతని సోదరుడు Gonzalo (ఇతను కూడా ఒక explorer).
Orellana, Gonzalo తో కలిసి క్విటోకు తూర్పున ఉన్న ప్రాంతాలను అన్వేషించడానికి ఒక సాహసయాత్ర చెయ్యాలని అనుకున్నారు.
ఒరెల్లానా Gonzaloకు లెఫ్టినెంట్‌గా నియమించబడ్డాడు. ఏప్రిల్ 1541లో, అతను 50 మంది సైనికులతో ఒక నౌక తీసుకొని, ముందుగా ఆ ప్రాంతానికి పంపబడ్డాడు. అతను నాపో మరియు మారన్ నదుల జంక్షన్ దగ్గరకు చేరుకున్నాడు.
ఆ నది ఉదృతంగా ఉండటంతో అతని బృందం ఈ సమయంలో అందులోకి వెళితే తిరిగి రావడం అసాధ్యం అని అతనిని ఒప్పించింది. బదులుగా, అతను అమెజాన్ నది వ్యవస్థలోకి వెళ్లి అందులో నుండి అతని యొక్క అన్వేషణ ప్రారంభించాడు.
అతను అమెజాన్ అడవి మొత్తం అన్వేషించి ఆగష్టు 1542లో నది ముఖద్వారానికి చేరుకున్నాడు. అతను స్పెయిన్‌కు తిరిగి వచ్చి స్పేనిష్ గవర్నమెంట్తో అమెజాన్ లోపల అనేక అద్భుతమైన నగరాలు ఉన్నాయని, అక్కడ దాదాపుగా 2 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నారని అక్కడ బంగారం గుట్టలు గుట్టలుగా ఉందని, దాల్చినచెక్కలు కూడా కావాల్సింత ఉందని వారికీ చెప్పాడు.
గ్రీకు పురాణాలలోని ఉన్న అమేజియాన్స్ అనే స్త్రీలు అక్కడ నిజంగానే ఉన్నారని, ఆ స్త్రీల నేతృత్వంలో చాలా తెగల ప్రజలు అక్కడ నివసిస్తున్నారని చెప్పాడు.
(అమెజాన్ అడవికి ఆ పేరు పెట్టింది Orellana ఎందుకంటే అతను అమేజియాన్స్ చూసానని ప్రపంచానికి తెలిపాడు కదా అందుకే అమెజాన్ అని పేరు పెట్టడు)
ఒరెల్లానా అతను కనుగొన్న ఆ ప్రాంతాలను అన్వేషించడానికి మరియు అక్కడ ఉన్న బంగారం, దాల్చిన చెక్క దోపిడీ చేసేందుకు కాను తనని మళ్ళీ అక్కడకి పంపాలి అని స్పేనిస్ రాజుని కోరాడు.
అయితే స్పానిష్ వారు ఆ ప్రాంతం యొక్క యాజమాన్యం పై పోర్చుగల్‌తో వివాదంలో ఉండటం వలన, అతనికి కొంతవరకు ధన సహాయాన్ని మాత్రమే అందించగలం కానీ అధికారిక మద్దతు ఇవ్వలేము అని తేల్చిచెప్పేసింది.
ఆ తర్వాత అతను మళ్ళీ అమెజాన్‌కు తిరిగి రావడం కోసం చాలా ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను పోర్చుగీసు వారికీ తెలియకుండా, అమెరికాకు వెళ్ళే మార్గంలో ఓడతో కొంతమంది సిబ్బందితో ప్రయాణించి అమెజాన్ అడవికి చేరుకున్నాడు.
అయితే దురదృష్టం కొద్దీ ఒరెల్లానా యొక్క ఓడ అమెజాన్ నది ముఖద్వారం దగ్గర బోల్తా పడింది అతను అతని సిబ్బంది మొత్తం ఆ అమెజాన్ నదిలో మునిగిపోయారు.
ఇది జరిగిన 100 సంవత్సరాల తర్వాత అనేకమంది అన్వేషకులు Orellana చెప్పిన గొప్ప నగరలను అన్వేషించడానికి అమెజాన్ మొత్తం తిరిగారు కానీ అక్కడ వాళ్ళకి చిన్న చిన్న అటవీకులు గుడారలు తప్ప గొప్ప నగరాలు, బంగారం వాళ్ళకి కనిపించలేదు.
దాంతో వాళ్ళు Orellana ప్రజలకి కట్టు కధలు చెప్పాడని అక్కడ ఎటువంటి నగరాలు లేవని తెలిపారు. దాంతో Orellana ప్రజలని అబద్దాలు చెప్పి మోసం చేసాడని మొన్నటి వరకు అందరు నమ్మారు.
Orellana చెప్పినట్టు నిజంగానే అక్కడ మహానగరాలు ఉండేవి అనడానికి సాక్షాలు ఉన్నాయా?
ఔను అనే అంటున్నారు కొందరు పురాతత్వ శాస్త్రవేత్తలు.
ఇటీవలే చేసిన పరిశోధనలలో అమెజాన్‌లో ఒకప్పుడు పురాతన నగరాలు నిజంగానే ఉండేవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నగరాల శిధిలాలు అమెజాన్ మారుమూల దట్టమైన అడవులలో ఉండటం వలన అక్కడకి వెళ్లడం చాలా కష్టం, అక్కడకి వెళ్ళాలి అంటే కాలినడకన వెళ్ళాలి.అందుకే ఇన్ని రోజులు కనుగొనలేకపోయారు.
ఇప్పుడున్న రోజుల్లో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. అలాంటి ఒక కీలకమైన సాంకేతికత ఈ పురాతన నగరాలని కనుగొనటంలో సహాయపడింది.
650 అడుగుల ఎత్తులో నుండి హెలికాప్టర్‌కి శాస్త్రవేత్తలు (LIDAR) కాంతి ఆధారిత రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి అడవిని జల్లెడా పట్టారు. దీనితో అమెజాన్ లోని బొలీవియన్, లానోస్ డి మోజోస్ పరిసర ప్రాంతంలో విస్తారమైన ఒక పురాతన నగరం శిధిలాలను గుర్తించారు.
ఈ నగరం ఒకప్పుడు గొప్పగా అభివృద్ధి చెంది ఉండేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇక్కడ గొప్ప స్మారక వేదిక మరియు పిరమిడ్ లాంటి నిర్మాణంతో,ఎత్తైన రిజర్వాయర్‌లు మరియు కాలువలతో కూడిన భారీ నీటి నియంత్రణ మరియు పంపిణీ వ్యవస్థ, మరియు రహదారులతో ఈ నగరం రూపొందించబడింది. ఇది ఇప్పటి ప్రకృతిలో కలిసిపోయినప్పటికి ఈ నగరం యొక్క శిధిలాలు కొన్ని మైళ్ల వరకు విస్తరించి ఉన్నాయి.
ఈ నగరం దాదాపు 600 సంవత్సరాల క్రితమే వదిలివేయబడింది.
ఒకప్పుడు అమెజాన్ యొక్క రెయిన్‌ఫారెస్ట్ “అడవి” వాస్తవానికి అత్యధిక జనాభాతో కూడి ఉంది అనేదానికి ఇది గొప్ప ఆధారం అయ్యింది.
దాదాపు 20 లక్షలు జనాభా ఉన్న అమెజాన్ నగరాలు ఎందుకు నేలమట్టం అయిపోయాయి?
అయితే ఇప్పుడు మళ్ళీ అందరికి పెద్ద అనుమానం మొదలయ్యింది. అంత గొప్ప నాగరికత, అన్ని లక్షల మంది ప్రజలు 100 సంవత్సరాల తర్వాత వెళ్లిన వారికీ ఎందుకు కనపడలేదు అని.
దానికి కారణం స్మాల్ ఫాక్స్ అని సైంటిస్ట్లు చెప్తున్నారు.Orellana మరియు అతని సిబ్బంది, ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ అన్వేషకులు అమెజాన్ అడవిలోకి వెళ్ళినపుడు వాళ్ళతో పాటు స్మాల్ ఫాక్స్, మసుచి వ్యాధిని తీసుకుని వెళ్లారు. అమెజాన్ అడవిలో నివసించే ప్రజల ఇమ్యూనిటీ అంత శక్తివంతం కాదు అందుకే ఆ వ్యాధులు సోకి అన్ని లక్షల జనాభా కొన్ని రోజుల్లోనే చనిపోయారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.