నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు రాజుపాలెం మండలం కొండమోడు గ్రామ పరిధిలోని అంజిరెడ్డి నర్సింగ్ కళాశాల నందు సత్తెనపల్లి రూరల్ సిఐ ఎంవి సుబ్బారావు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన, డ్రగ్స్, ర్యాగింగ్ మరియు ఆత్మహత్యలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
డిజిటల్ ప్రపంచంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి, సైబర్ నేరాలకు బలి కావొద్దు.
సమాజాన్ని సురక్షితంగా ఉంచడంలో ప్రతి ఒక్కరి బాధ్యత – సైబర్ నేరాలను అరికట్టండి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.
సైబర్ నేరాలు అజ్ఞానం వల్ల కాదు, అవగాహన లోపం వల్ల జరుగుతాయి.
మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉండటం అనేది మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తుకు కీలకం. ప్రతి ఒక్కరూ అవగాహనతో, జాగ్రత్తతో ఉండాలి.
ఎవరికి ఊరికే ఏమీ రాదని గ్రహిస్తే చాలు సైబర్ నేరాలను నియంత్రించవచ్చు.
సైబర్ క్రైమ్ ను చేదించే కంటే నివారణ ఉత్తమ మార్గం.
ఇటీవల కాలంలో గంజాయి వంటి మత్తు పదార్థాలు యూనివర్సిటీలు కాలేజీలలో విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని అసాంఘిక శక్తులు పనిచేస్తున్నాయని వాటికి సంబంధించిన ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 లేదా పల్నాడు జిల్లా ఎస్పీ కి సమాచారం ఇస్తే డ్రగ్స్ పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
మానవత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై కొంతమంది విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. వాటికి మూలమే మద్యం, మత్తు పదార్థాలు అని వాటికి దూరంగా సురక్షితంగా ఉంటూ సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని విద్యార్థినులను కోరారు.
కాలేజీ నందు విద్యార్థినులకు ఏమైనా సమస్య ఉన్న ఎడల పోలీసు వారి దృష్టికి తీసుకుని రావాలని చెప్పారు.
పోలీసు వారికి స్వయంగా చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు వారంలో ఒకరోజు పోలీస్ స్టేషన్ నుండి ఒక మహిళా కానిస్టేబుల్ కాలేజ్ నందు అందుబాటులో ఉంటారని ఆరోజు మహిళ కానిస్టేబుల్ ని కలిసి తమ సమస్యను తెలుపవచ్చునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు రాజుపాలెం ఎస్సై కె.వేణు గోపాల్, కళాశాల యాజమాన్యం మరియు 300 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.