నారద వర్తమాన సమాచారం
తెలంగాణలో విజయవంతంగా కుటుంబ సర్వే!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024,విజయవంతంగా సాగుతోంది.
అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశమం దరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది.
సర్వేలో ముందుగా నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇళ్ల గణన ను ప్రభుత్వం చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించింది. నవంబర్ 9వ తేదీ నుంచి ఇంటింటి వివరాల సర్వే ప్రారంభించింది.
మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది. నవంబర్ 17 నాటికి సర్వే పూర్తయిన ఇండ్లు:
- గ్రామీణం: 64,41,183
- పట్టణం: 51,73,166
- మొత్తం: 1,16,14,349
బ్లాకులు:
- గ్రామీణం: 52,493
- పట్టణం: 40,408
- మొత్తం: 92,901
ఎన్యుమరేటర్లు:
- గ్రామీణం: 47,561
- పట్టణం: 40,246
- మొత్తం: 87,807
జిల్లాల వారీగా సర్వే పురోగతిలో ములుగు (87.1% ), నల్గొండ (81.4%) జిల్లాలు ముందంజలో ఉన్నాయి.
జనగాం (77.6%), మంచిర్యాల (74.8%), పెద్దపల్లి (74.3%) తర్వాత వరుసలో ఉన్నాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.