నారద వర్తమాన సమాచారం
ప్రస్తుతం జరుగుతున్న పలు కార్యక్రమాలు మీద ప్రెస్ మీట్ నిర్వహించిన పల్నాడు జిల్లా డీ ఎస్పీ కె.నాగేశ్వరరావు
పల్నాడు జిల్లా :-
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు ఈరోజు నరసరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కె.నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది
ఈ ప్రెస్ మీట్ నందు డిఎస్పీ ఈ క్రింది విధంగా మాట్లాడారు.
కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి కి సంబంధించి ఏర్పాటు చేసిన బందోబస్తు వలన భక్తులకు ఇప్పటి వరకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడటం జరిగింది.
అదే విధంగా
26.02.2025 వ తేదీన జరిగే మహాశివరాత్రి కు సంబంధించి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళు రాష్ట్ర పండుగ కావున ఇప్పటినుండే అన్ని ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు.
స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రూట్లు, చెక్ పోస్ట్ లు బందోబస్తు ఏర్పాట్ల ప్రణాళికలను పల్నాడు జిల్లా ఎస్పీ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు
ఈ రోజున శృంగేరి శంకర మఠం జగద్గురు శంకరాచార్య శ్రీ భారతీ మహా స్వామీజీ నరసరావుపేట పట్టణానికి వస్తున్న కారణంగా బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
నరసరావుపేట పట్టణంలో ఇప్పటికే గంజాయి మీద అనేక కేసులు పెట్టడం జరిగినట్లు, అదేవిధంగా పాలు, నూనె కల్తీల మీద నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కల్తీ వ్యవహారాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నట్లు దానికిగాను ప్రజల నుండి సహకారం ఉండాలని తెలిపారు.
ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ, గంజాయి మీద, కల్తీ వ్యవహారాల మీద సమాచారం తెలిసినచో వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ ప్రెస్ మీట్ నందు నరసరావుపేట డిఎస్పి కె. నాగేశ్వరరావు తో పాటు నరసరావుపేట ఒకటో పట్టణ సీఐ M. విజయ్ చరణ్ , నరసరావుపేట టూ టౌన్ సిఐ M. హైమారావు నరసరావుపేట రూరల్ సిఐ పి రామకృష్ణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.