నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలిస్…
కారంపూడి వీరుల ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు : పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాసరావు ఐపిఎస్
వీరుల ఉత్సవాల ఏర్పాట్లను తమ సిబ్బందితో పరిశీలించిన ఎస్పీ
కారంపూడి పట్టణంలోని స్థానిక వీరుల దేవాలయంలో జరిగే ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.
పల్నాడు జిల్లా కారంపూడి నందు ది.30.11.2024 వ తేదీ నుండి ది.04.12.2024 వ తేదీ ఐదు రోజుల పాటు జరిగే వీరుల ఉత్సవాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాట్లు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాసరావు అన్నారు.
అనంతరం పల్నాడు జిల్లాకు నూతనంగా రావడంతో పల్నాటి చరిత్రపై పీఠం నిర్వాహకులు బొగ్గరం విజయకుమార్,పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ నుంచి ఆలయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు లో ముఖ్యంగా ట్రాఫిక్, వీర్ల గుడి వద్ద మరియు అంకాలమ్మ గుడి వద్ద, భక్తులు స్నానం ఆచరించడానికి
వచ్చే నాగులేరు వద్ద భక్తుల రద్దీ ను దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయుటకు పోలీసు అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు
వీరుల ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గురజాల డిఎస్పి జగదీష్ కారంపూడి సీఐ టీ.వీ. శ్రీనివాసరావు , కారంపూడి ఎస్సై
టి.వాసు , తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.