నారద వర్తమాన సమాచారం
జర్నలిజం ఆరంభం
కుంఫిణి యుగం నాటి జర్నలిజం
1830 -1857 మధ్యకాలంలో తెలుగు పత్రికల ఆరంభ కాలంలో చెప్పబడుతుంది.
భారతదేశ పత్రిక రంగంలో ఏదో నూతన అధ్యాయం.
ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలం ఈ కాలంలో ముంబై కోల్కత్తా చెన్నై నగరాల నుండి తెలుగు పత్రికల ముద్రణ అయ్యే రాష్ట్రంలో ప్రధాన నగరాల మార్కెట్లలో అందుబాటులో ఉండేవి.
ఆనాటి పత్రిక రంగానికి ఏ రాజకీయ రంగులు లేవు పత్రికలు సమాజ సంస్కరణ కోసం పనిచేశాయి
మన భారత దేశంలో సంస్కరణోద్యమం విద్య సాంస్కృతిక విషయాల ప్రచురణల ద్వారా నాటి తెలుగు పత్రికలకు ప్రజలు, పాలకులు అభిమాన పాఠకులయ్యారు .
అచ్చ తెలుగు పత్రికల ఆవిర్భావం
1831 నాటికి “తెలుగు జర్నల్” అనే తెలుగు పత్రికను మద్రాసు లండన్ మిషన్ సొసైటీ నడిపినట్లు తెలుస్తోంది.
మొత్తం మీదట 1833 నాటికే తెలుగు జర్నలిజం ఆవిర్భావం జరిగినట్లు కొన్ని ఆధారాలు ఉన్న ఇవి కొన్ని మతాల పత్రికలుగా తెలుస్తుంది.
స్వాతంత్ర్యానికి ముందు జర్నలిజం
1947 కి ముందు ఏ రాజకీయ రంగులో పోసుకొని జర్నలిజం ఈ సమాజంలో నాడు పాతుకుపోయిన
మూఢనమ్మకాలు అందవిశ్వాసాల నుండి ప్రజల్లో చైతన్య కలిగించి మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషిని మార్చింది.
సామ్యవాద భావజాలానికో జర్నలిజం
దేశానికి స్వాతంత్రం రావాలి అంటే సరికొత్త మార్గాల బాట పట్టాల్సిన అవసరం ఉందని ఆనాడు స్వాతంత్ర ఉద్యమ కాలంలో కొందరు స్వామివాద భావజాలానికి ఆకర్షితులైన వారు అదే భావజాలం కలిగి కొన్ని పత్రికలు సామ్యవాద భావజాల అతివాద రాజకీయ ప్రచారం చేయడం ద్వారా సామ్యవాద భావజాల జర్నలిజం వచ్చింది.
స్వాతంత్ర్యోద్యమం కోసం నాటి జర్నలిజం
నాడు ఏ రాజకీయ రంగు పూసుకొని జర్నలిజం ప్రజలను పరాయి పాలకులను బానిసలు కారాదని ప్రజల్లో చైతన్యం రగిలించింది బానిస సంకెళ్లు తెంచుకోమంది.
స్వాతంత్ర్యం సాధనకు ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని నింపింది దేశ స్వాతంత్ర్యం కోసం నాటి జర్నలిజం బ్రిటిష్ పాలకుల లక్ష్యసాధన నినాదిస్తూ,నిలదీస్తూ, అక్షర సమరం చేసింది నాటి జర్నలిజం.
విప్లవాత్మక జర్నలిజం
ఈ తరహా జర్నలిజం కూడా మన దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలోనే ఆవిర్భావం జరిగింది.
తెల్లవారి బానిస సంకెళ్లు తెంచుకునేందుకు అహింసాయుత పోరాటంలో విసిగిపోయిన కొందరు నాటి దేశ పౌరులుఇక వారిపై ఎదురు దాడి చేయక తప్పదని పోరాట దిశగా అడుగులు వేశారు.
విప్లవ, ఉద్యమాన్ని, విప్లవ చరిత్రను, ప్రతిఫలిస్తూ, విప్లవ భావాలు ప్రచారం. విప్లవ సాహిత్యానికి కవిత్వం కి కొన్ని పత్రికలు ఆదరణ కల్పించాయి.
నక్సల్ బరి పత్రికలతో జర్నలిజం
1971లో తెలుగు జర్నలిజంలో ఈ తరహా పత్రికలు జీవం పోసుకున్నాయి వీటిలో “జనశక్తి “పత్రిక మొట్టమొదటి నక్సలు వారి పత్రిక చెబుతారు.
ఒకనాటి పీపుల్స్ వారు గ్రూపు దళనాయకుడు కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో ” పిలుపు” అనే పత్రిక నడిచింది ఇక “విమోచన క్రాంతి” “ప్రజాపంద”, “ప్రతిఘటన”, “నక్సల్బరి”, “రాడికల్స్ మార్చ్”, “కార్మిక పదం”, “విజృంభన”, “తిరుగుబాటు” వంటి పత్రికలు అన్ని ఏ పత్రికల్లో ను వ్యాపార ప్రకటన లేకుండా ఓ సిద్ధాంత పరంగా పనిచేశాయి.
విష నాగుల పుట్టల్లా మారిన ఆధునిక జర్నలిజం
ఆధునిక జర్నలిజం పేరిట తెలుగు మీడియా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి 1995 తర్వాత ఒకనాటి ఆధునిక జర్నలిజంతోపాటు 2005 సంవత్సరం తర్వాత మరింత టెక్నాలజీతో 2015 నాటికి జర్నలిజం కొత్త రూపుకు మార్పు వచ్చింది.
ఇక నడుస్తున్న ఈ కాలంలో సోషల్ మీడియానే జర్నలిజం గా మారిపోయింది.
ఇక్కడే జర్నలిజం, పసుపు, ఎరుపు,బులుగు, కాషాయం, పచ్చ,గులాబీ,ఇలా జర్నలిజానికి రాజకీయ పార్టీల రంగులు పార్టీకి ఒక రంగులే ప్రధానంగా ఇజంలా జర్నలిజానికి రంగులు పులిమేశారు.
ఇక ప్రస్తుత జర్నలిజం స్వార్థ రాజకీయాలకు, దొరల్లా, సమాజాన్ని పలు సంస్థలను అడ్డు అదుపు లేకుండా దోచుకోవడానికి జర్నలిస్టులే తమ మీడియా సంస్థలకు దోచిపెట్టే ఏజెంట్లుగా నియామకం చేస్తూ జర్నలిజానికి నల్లటి ముసుగు వేసి చీకటి వ్యవహారాలతో ఈనాటి మీడియా సంస్థలన్నీ కలిసి విషంనాగుల్లా వలయంలా అవినీతి పుట్టలు పెట్టుకున్నాయి.
ప్రస్తుత జర్నలిజం పై విధంగా మారిపోయింది
సేకరణ
నారద వర్తమాన సమాచారం 🪴💐🙏
Discover more from
Subscribe to get the latest posts sent to your email.