నారద వర్తమాన సమాచారం
గాంధీపార్కులో కొన్ని సంవత్సరాల వయసు ఉన్న టేకు చెట్టు నరికివేత..
చెట్టు విలువ సుమారు రూ. లక్ష విలువ ఉంటుందని అంచనా….
మున్సిపల్ ఇంటిదొంగల పనే అంటున్న ప్రజలు..
చిలకలూరిపేట:
ఇంటిదొంగను ఈశ్వరుడైన పట్టలేడంటారు.. చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఇంటిదొంగలు ఎక్కువయ్యారు. అసలు విషయానికి వస్తే చిలకలూరిపేట పట్టణంలో నడిబొడ్డున గాంధీపార్కు ఉంది. పేరుకు పార్కే గాని అక్కడ పచ్చదనం ఆనవాళ్లు ఎప్పుడో మటు మయం అయ్యాయి.పార్కులో సగభాగం ఓవర్‌హెడ్ ట్యాంకర్ల నిర్మాణం చేయడం,చుట్టూ వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేయడంతో పార్కు కుంచించుకుపోయి, కొంతమంది అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది. పార్కులో ఏళ్ల నాడు అంటే మూడు దశాబ్దాల నాడు నాటిక టేకు మొక్క పెద్ద చెట్టుగా విస్తరించింది. బహిరంగ మార్కెట్లో ఇది సుమారు రూ.లక్ష చేస్తుందని చెబుతున్నారు. అయితే ఉన్నట్లుంది చెట్టు మాయమైంది.ఎవరో ఇది మొదలుకు నరికి తరలించడానికి సిద్ధపరిచారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.సోషల్ మీడియా ద్వారా ఇది బహిర్గతం కావడంతో ఎవరికి వారు తేలు కుట్టిన దొంగల్లా ఈ విషయం పై సమాధానం చెప్పేందుకు దాటవేస్తున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఒక రైతు తమ పొలంలో పెంచిన వృక్షాలను తొలగించాలంటే ముందుగా ఆన్‌లైన్లో తమ భూమికి సంబంధించిన అంశాలను నమోదు చేసుకోవాలి.తొలగించదలచుకున్న చెట్ల వివరాలు, వాటి సంఖ్య వాటి వయసు ఇతర అంశాలను పొందుపరచాలి. చెట్టును నరకాల్సి వస్తే అంతకు ముందే రెట్టింపు సంఖ్యలో మొక్కలను నాటాల్సి ఉంటుంది.చెట్టుకు రూ.450 ధరావత్తు అటవీ శాఖ పేరుతో చెల్లించాలి. అదనంగా రూ.25 ఛార్జీలు వర్తిస్తాయి. స్థానికంగా ఉండే అటవీ అధికారులు ఈ వివరాల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ నిర్వహించి అనుమతి ఇస్తారు. ఆన్‌లైన్లోనే అనుమతు లు వస్తాయి. ఇవి పొందితే తొలగించిన కలపను ఎక్కడికైనా తరలించుకునే అవకాశం ఉంటుంది.ఇదే నిబంధనలు నరికిన టేకు చెట్టుకు వర్తిస్తుంది. గాంధీపార్కులో కొన్ని సంవత్సరాల వయసు గల టేకు చెట్టే నరికి తరలింపులో మున్సిపాలిటీ ఇంటి దొంగ పనే అయి ఉంటుందని పట్టణ పుర ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.