నారద వర్తమాన సమాచారం
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం?
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో మధ్యాహ్నం 12 గంటల సమయానికే మహాయుతి కూటమి 222 స్థానాల్లో విజయం సాధించింది.
మహారాష్ట్రలో ఒక కూటమి 200 స్థానాలకుపైగా స్థానా ల్లో విజయం సాధించడం ఇదే తొలిసారిగా రాజకీయ పరిశీలకులు చెబుతు న్నారు. మహారాష్ట్రలో అధికారంలోకి రావాలంటే 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
కానీ మహాయుతి అంతకుమించిన ఘన విజయం సొంతం చేసు కుంది. మహాయుతి కూటమిలో బీజేపి, సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వం లోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఉన్నాయి.
మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకునే దిశగా మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు.
ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫడ్నవీస్ సీఎం అంటూ మహా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుండటంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు.. సీఎం సీటు వదులుకునే ప్రసక్తే లేదంటోంది షిండే వర్గం. దీంతో.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.