నారద వర్తమాన సమాచారం
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం?
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సంబరాలు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల :-
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో మధ్యాహ్నం 12 గంటల సమయానికే మహాయుతి కూటమి 222 స్థానాల్లో విజయం సాధించిన సందర్భంగా ఆనంద కోలహాల మధ్య.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు ఏలూరు శశి కుమార్, మరియు పట్టణ బిజెపి అధ్యక్షులు ఆత్మకూరి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో స్వీట్స్ పంచారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు నూతి అరుంధతి, సూరేపల్లి అంజమ్మ, కొత్త మణికంఠ, పొట్టి ముత్యం హేమంత్, చలంచర్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో ఒక కూటమి 200 స్థానాలకుపైగా స్థానా ల్లో విజయం సాధించడం ఇదే తొలిసారిగా రాజకీయ పరిశీలకులు చెబుతు న్నారు. మహారాష్ట్రలో అధికారంలోకి రావాలంటే 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
కానీ మహాయుతి అంతకుమించిన ఘన విజయం సొంతం చేసు కుంది. మహాయుతి కూటమిలో బీజేపి, సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వం లోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఉన్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.