నారద వర్తమాన సమాచారం
కలెక్టర్ సార్ కనీసం మాకు మంచి అన్నం పెట్టించండి.. స్కూల్ వదిలి కలెక్టర్ దగ్గరికి వచ్చి మొర పెట్టుకున్న 400 మంది విద్యార్థులు
కరీంనగర్
జగిత్యాలలో మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామంటూ రెండుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు.
కరీంనగర్ – పురాతన పాఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కలెక్టరేట్‌కు దగ్గరలోనే ఉన్న ఈ పాఠశాలలో వారంరోజులుగా ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని, అడుగు భాగం మెత్తగా, ముద్దగా మారి మాడిపోతోందని, ఆ అన్నం ఎలా తినేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
అరగంట పాటు ఆందోళన చేసినా ఉన్నతాధికారులెవరూ పాఠశాలకు రాలేదు. దీంతో విద్యార్థులు అన్నం తినకుండానే పడేశారు.
జగిత్యాల – ఆరెపల్లి పాఠశాలలో వంట మనిషిని మార్చాలని కోరుతూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని, రుచిలేని అన్నం వడ్డిస్తున్నారని, ప్రశ్నిస్తే ఇష్టమున్నచోట చెప్పుకోమంటూ వంట మనుషులు బెదిరిస్తున్నారని ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్నారు.
నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రజావాణి ఆడిటోరియంలోకి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అనంతరం రోడ్డుపై బైఠాయించారు. వంటమనిషిని తొలగించి సరైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.