నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 67 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ మస్తాన్ బి
పులుకూరి లక్ష్మీ వద్ద చిట్టి వేసినట్లు సదురు చిట్టి పాట తాలూకా లక్ష్మి లక్ష రూపాయలు ఇవ్వవలసి ఉండగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు అంతేకాక ఫిర్యాది
4లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు అందుకుగాను ఎస్పీ ని న్యాయం చేయవలసిందిగా అర్జీ ఇవ్వడం జరిగింది.
నరసరావుపేటకు చెందిన మేకల సత్యవతి 1970వ సంవత్సరంలో మాచర్ల పట్టణంలోని కోర్టు వెనుక వైపున 9 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ నిర్మించినట్లు అయితే 19/11/2024 2024వ తేదీన దానం బాబు, సుబ్రహ్మణ్యం మొదలగువారు ఫిర్యాది స్థలానికి ఉన్న ప్రహరీని పడగొట్టిన విషయమై ఫిర్యాదు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట వరవకట్ట కు చెందిన నాజెండ్ల నాగసాయి రజని అను ఆమెకు సుమారుగా ఐదు సంవత్సరాల క్రితం ఒంగోలు వాసికి ఇచ్చి వివాహం చేయగా, ఫిర్యాదు మూడు నెలల గర్భవతిగా ఉన్నపుడు భర్త చనిపోయినట్లు, ఆ సమయంలో అత్తమామలు మరియు భర్త తరఫు కుటుంబ సభ్యులు బాగా చూసుకుంటామని నమ్మించి ఆడపిల్ల పుట్టిన తర్వాత భర్త బంధువులు అందరూ కొట్టి చంపబోగా ఫిర్యాది తల్లిదండ్రులు తమ వద్దకు తీసుకొని వచ్చినట్లు కావున ఫిర్యాదు తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.
వినుకొండ పట్టణానికి చెందిన ఆవుల ఇందిరా దేవి ది15.03.2024వ తేదీన ఒంగోలు వెళ్ళుటకు గాను వినుకొండ బస్టాండ్ లో ఒంగోలు బస్సు ఎక్కినట్లు, శివయ్య స్తూపం వద్ద ఒక అమ్మాయి అబ్బాయి బస్సు ఎక్కి వినుకొండ లోని కోటప్ప నగర్ లో దిగినట్లు, కొంతసేపటి తరువాత బ్యాగ్ చూసుకోగా కట్ చేసి బ్యాగ్ లో ఉన్న గోల్డ్ బాక్స్ పోయినట్లు గుర్తించి ఫిర్యాది కోటప్ప నగర్ లో దిగిన అమ్మాయి అబ్బాయి మీద అనుమానంతో ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన మన్నేపల్లి బ్రహ్మయ్య కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నాగేశ్వరరావు అనే వ్యక్తి 2,30,000/- రూపాయలు మోసం చేయగా సదరు విషయమై ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
చిలకలూరిపేట పట్టడానికి చెందిన రాచమల్లు వెంకట శివరామకృష్ణ ప్రసాద్ తో తన సొంత మేనల్లుడు ఆయన నాగేశ్వరరావు లాగా అపరిచిత వ్యక్తి ఫోన్లో మాట్లాడి ఫోన్ ద్వారా లక్ష రూపాయలు కొట్టించుకొనినట్లు, కావున నమ్మించి మోసం చేసిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకోనవలసింది గా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.
నరసరావుపేట పట్టణానికి చెందిన గుర్రపుశాల సాయి దుర్గ భర్త అయిన గోపి మరియు ప్రదీప్ అనే వారు ఇద్దరు కలిసి గ్రిల్ నైట్స్ అనే హోటల్ పెట్టి వ్యాపారం కొరకు ఫిర్యాదు పేరు మీద 5,00,000/- రూపాయలు లోన్ తీసుకొనినట్లు, వ్యాపారం సరిగ్గా నడవక హోటల్ తీసివేయగా ఇప్పుడు లోన్ అమౌంట్ ఇవ్వకుండా ప్రదీప్ ఇబ్బంది పెడుతున్నట్లు, అడిగితే ఫిర్యాదు మరియు అతని భర్త మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తున్నందున తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పి ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన కొంతమంది రైతులు విజయ భాస్కర్ ట్రేడర్స్ గుంటూరు వారికి 640 ఎండుమిర్చి బస్తాలు అమ్మగా వాటి విలువ సుమారు 42,65,000/- రూపాయలు.డబ్బులు కొరకు ఎంత తిరిగిననూ ఇవ్వకుండా మోసం చేసినట్లు కావున
తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు మరియు దూర ప్రాంతాల నుండి వచ్చిన అర్జీ దారులకు దాతల సహాయంతో భోజన ఏర్పాట్లను చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.