నారద వర్తమాన సమాచారం
క్రోసూరు
ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం
శ్యామ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరులో గౌరవాధ్యక్షులు శిఖా శాంసన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మెయిన్ బజార్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శిఖా శాంసన్ భారత రాజ్యాంగం పీఠికను ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమానత్వం తీసుకురావడానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు స్వాతంత్ర్యం రాగానే రెండేళ్లకు పైగా కష్టపడి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించడంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు నాటి నుంచి ఈ వేడుకలు జరుపుకోవడం శుభ పరిణామం అన్నారు జాతీయ సమైక్యతను సమరక్షిస్తూ, సౌభాగ్య్రతాన్ని పెంపొందించటమే లక్ష్యంతో ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు ప్రజలలో జాతీయ భావం పెరగాలన్నారు ప్రపంచ దేశాలలో భారత దేశ రాజ్యాంగం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గోగినేని సాంబశివరావు, మిత్ర మండలి కార్యదర్శి షేక్ జానీ భాష కృపారావు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.