నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
🚦🚔 రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి –🚦🚔
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు నరసరావు పేట డిఎస్పీ నాగేశ్వర రావు పర్యవేక్షణలో ఈ రోజు ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది
ట్రాఫిక్ అవగాహన ర్యాలీ గడియార స్థంభం వద్ద గల మున్సిపల్ హై స్కూల్ నుండి మల్లమ్మ సెంటర్ మీదుగా హై స్కూల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.మల్లమ్మ సెంటర్ నందు స్కూల్ విద్యార్థులతో మానవ హారం ఏర్పాటు చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ CH. లోకనాథం గారు మరియు నరసరావు పేట 2వ పట్టణ సీఐ హైమారావు మాట్లాడుతూ…
రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం.
నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం, విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం వాహనం నడపడం, వ్యతిరేక దిశలో ప్రయాణించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించక పోవడం, అతివేగం, U- టర్న్ తీసుకునేటప్పుడు చుట్టూ వున్న వాహనాలను గమనించక పోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు.
విద్యార్ధి దశ నుండే రోడ్డు భద్రతా నియమాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలి. అంతేకాకుండా వాటిపై వారి కుటుంబ సభ్యులకు మరియు చుట్టుప్రక్కల వారికి కూడా అవగాహన కల్పించాలి.
కుటుంబంలో ఏ వ్యక్తి అయినా ప్రమాదానికి గురైనా లేదా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతాయి. కావున వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలి.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బాధితులకు తగిన దైర్యం చెప్పి, క్షతగాత్రులకు త్వరితగతిన వైద్యసహాయం అందే విధంగా తగిన చర్యలు తీసుకోవడం మన అందరి బాధ్యత.
వాహనదారులు సీటు బెల్టు ధరించక పోవటం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటో సైడ్ సిట్టింగ్, డెఫెక్టీవ్ నంబర్ ప్లేట్స్, అనధికార పార్కింగ్ మొదలైన చట్టపరమైన ఉల్లంఘనలకు ఎవరూ పాల్పడకూడదని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు దిగువ పేర్కొన్న సూత్రాలు తప్పకుండా పాటించాలని తెలిపారు.
1) మద్యం సేవించి వాహనాలు నడుపరాదు.
2) వాహనాలు నడుపునప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ మరియు ఇతర వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలి.
3) cell phone మాట్లడుతూ వాహనాలు నడుపరాదు.
4) అతివేగంతో వాహనాలు నడుపరాదు.
5)తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి.
6) జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా Line Dicipline పాటించాలి.
7)శ్రద్ధతో వాహనాలు నడపాలి.
8) వాహనాలు ఓవర్ టేక్(Over Take) చేసే సమయంలో తప్పనిసరిగా అద్దాలు(Mirrors) గమనించాలి.
9)రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సహాయం అందేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ట్రాఫిక్ అవగాహన ర్యాలీ కార్యక్రమమునకు సహకరించి మున్సిపల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ రవికాంత్ని మరియు టీచర్లను పోలీసు అధికారులు అభినందించారు. ఈ ట్రాఫిక్ అవగాహన ర్యాలీ కార్యక్రమము నందు ట్రాఫిక్ సిఐ ch. లోకనాధం
lనరసరావు పేట 2వ పట్టణ సిఐ హై మారావు ,ట్రాఫిక్ యస్.ఐ వేణు ,1వ పట్టణ
యస్.ఐ అరుణ , మున్సిపల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ రవికాంత్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.