నారద వర్తమాన సమాచారం
18 సంవత్సరాలు నిండిన యువత ఓటు నమోదు చేసుకోవాలి
పిడుగురాళ్ల :
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో స్కాలర్స్ డిగ్రీ కాలేజ్ నందు ఓటు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల తహసీల్దార్ జెట్టి మధుబాబు, మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జె. మధు బాబు మాట్లాడుతూ ప్రతి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినీ విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, వివిధ స్థాయిలలో జరిగే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా, నిజాయితీగా, ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, ఓటరు చైతన్యమే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియ పై అవగాహన పెంచుకోవాలని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకులోను కాకుండా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తదుపరి మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఈ దేశంలో యువతీ యువకులు దేశానికి పట్టుకొమ్మలని అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతీఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థిని,విద్యార్థులకు ఓటు నమోదు అప్లికేషన్ ఫామ్ లో అందించారు.
ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓ లు , దీపిక, విధిలియా, రామకృష్ణ, శామ్యూల్ బాబు,
మరియు సూపర్వైజర్లు రంజిత్ కుమార్,షేక్.ఇర్షాద్, సైదారావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.