Thursday, February 6, 2025

🤝మీతో – మేము (మీ రక్షణ – మా బాధ్యత)🤝

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా పోలీస్

🤝మీతో – మేము (మీ రక్షణ – మా బాధ్యత)🤝

పల్నాడు జిల్లా ప్రజలకు వివిధ అంశాల పై అవగాహన మరియు జాగ్రత్తలు తెలిపే విధంగా రూపొందించిన వినూత్న కార్యక్రమం “మీతో – మేము” ను ప్రారంభించిన ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ఐపిఎస్  మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్ .


ఈరోజు(29.11.2024) జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణ లో సాయంత్రం 4.10 నిమిషాలకు పల్నాడు జిల్లా ఎస్పీ ,పల్నాడు జిల్లా కలెక్టర్  ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పల్నాడు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

“మీతో మేము” మీ రక్షణ – మా బాధ్యత అను కార్యక్రమం పల్నాడు జిల్లా లోని ప్రజలు వివిధ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి తగిన సూచనలు,వాటి పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశం తో రూపొందించబడింది.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ల వద్ద డిజిటల్ డిస్ప్లే స్క్రీన్ లను ఏర్పాటు చేయడం ద్వారా పౌరులకు అవగాహన మరియు సమాచారాన్ని అందించడం మరియు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలను పెంపొందేందుకు సహాయపడుతుందని తెలిపారు.

ఈ డిజిటల్ స్క్రీన్లు ప్రత్యేకంగా సాటిలైట్ సిస్టంతో అనుసంధానంగా పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ సిస్టం ద్వారా ఉపయోగకరమైన సమాచారం వీడియోలు మరియు చిత్రాలు ప్రసారం చేయబడతాయి అని ఎస్పీ తెలిపారు.

సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించి సైబర్ లింక్స్ వస్తున్నప్పుడు వాటిని ఓపెన్ చేయకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి


ప్రస్తుత యువత గంజాయి డ్రగ్స్ పట్ల ఏ విధంగా ప్రమత్తంగా ఉండాలి అవి తీసుకొనడం వలన వారి భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన ఇబ్బందులు

మహిళా రక్షణలో
పోలీసు వారి పాత్ర ఏ విధంగా ఉంటుంది మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారిని చట్టపరంగా ఏ విధంగా శిక్షిస్తారో రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన కల్పించుకుని తమ యొక్క ప్రాణాలను భద్రంగా చూసుకునే విధంగా వీడియోలను రూపొందించడం జరిగిందని ఎస్పీ  తెలిపారు.

సమాజంలో పౌరుల యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలో వీడియో ద్వారా రూపొందించడం జరిగింది.

యువత చిన్న చిన్న కారణాలకు భయపడకుండా వారి యొక్క తాలూకు జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండేందుకు

ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అనుచిత పోస్టులు పెట్టే వారి పట్ల పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయడం జరిగింది.

మీతో  మేము కార్యక్రమం ద్వారా ప్రజలకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున పల్నాడు జిల్లాలోని 34 పోలీస్ స్టేషన్లలో ఈ డిస్ప్లే ల ద్వారా ప్రజలకు చైతన్య పరచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించినట్లు ఎస్పీ  తెలిపారు.

దీనిని రాబోయే కాలంలో విస్తృతంగా విద్యాసంస్థలు హాస్పిటల్స్ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
కచ్చితంగా నేరాల సంఖ్య తగ్గిస్తాం మీ భరోసాతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగినట్లు ఎస్పీ  తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

పల్నాడు జిల్లా ఎస్పీ  ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో డిజిటల్ బోర్డ్స్ పెట్టి పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలను కానీ ఇతర ప్రజలందరికీ చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ ఎటువంటి నేరాలు జరిగే అవకాశం ఉంది, వాటిని ఎలా అధిగమించాలి అని అవగాహన కల్పించడానికి శ్రీకారం చుట్టిన పల్నాడు జిల్లా ఎస్పీ ని అభినందించారు

కొన్నిసార్లు చదువుకునే విద్యార్థులకు క్షణికావేశంలో చిన్న చిన్న సమస్యలకు భయపడి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అలాగే యువత ఈజీ మనీ అలవాటు పడి నేరాలు చేస్తున్నట్లు యువత గంజాయి సంస్కృతికి అలవాటు పడి నేరాలు చేస్తున్న వారి పై పల్నాడు జిల్లా ఎస్పీ  చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్  తెలిపారు.
పల్నాడు జిల్లాలో ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించినందుకు  కలెక్టర్  ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

అదేవిధంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు ట్రాఫిక్ సిబ్బంది కొరకు ప్రత్యేకంగా 3 ద్విచక్ర వాహనాలను పల్నాడు జిల్లా ఎస్పీ అడుగు జిల్లా కలెక్టర్  ప్రారంభించారు
ఈ కార్యక్రమ ప్రారంభోత్సవమున కు పల్నాడు జిల్లా ఎస్పీ , పల్నాడు జిల్లా కలెక్టర్ ,J.V సంతోష్ (అడ్మిన్)  మరియు నరసరావుపేట డిఎస్పి K.నాగేశ్వరరావు సత్తెనపల్లి డి.ఎస్.పి. M.హనుమంతరావు , గురజాల డిఎస్పి జగదీష్ ,మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వెంకట రమణ తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading