నారద వర్తమాన సమాచారం
అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతోన్న పుష్ప 2..
పుష్ప 2 టికెట్ అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రభాస్ ‘బాహుబలి 2’ రికార్డును ‘పుష్ప 2’ బద్దలు కొట్టిందని సినీ పండితులు చెబుతున్నారు. కాగా ఆంధ్రా, తెలంగాణా, కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిన్న బుకింగ్ ప్రారంభం కాలేదు. తెలంగాణలో సాయంత్రం స్టార్ట్ కాగా, కేరళలో ఆదివారం (డిసెంబర్ 01) అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అయినా నిన్న ఒక్క భారతదేశంలోనే మల్టీప్లెక్స్‌లలో 55,000 కంటే ఎక్కువ టిక్కెట్లు ముందస్తుగా బుక్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలుపుకుంటే తొలిరోజే 2.79 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి.
ఆదివారం (డిసెంబర్ 1) కేరళలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఓపెనింగ్ అయిన వెంటనే ప్రధాన థియేటర్లలో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఆంధ్రాలో టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఒకసారి అక్కడ కూడా టికెట్ బుకింగ్ ఓపెన్ అయితే ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. కొన్ని నివేదికల ప్రకారం, ఇప్పటి వరకు కేవలం ఒక రోజు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా 30 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని సమాచారం. విడుదలకు మరో నాలుగు రోజలు సమయం ఉంది. కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల ద్వారానే దాదాపు వంద కోట్ల కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.