నారద వర్తమాన సమాచారం
రేషన్ బియ్యానికి బదులు నగదు అందిస్తే ఎలా ఉంటుందోనని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం..!
కిలో రేషన్ బియ్యం పై 40 రూపాయల వరకు భారం పడుతుంది. ప్రభుత్వమే ఈ రాయితీని భరిస్తోంది.
అయితే ఈ రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పక్క దారి పడుతుంది.
రేషన్ విడిపిస్తున్న లబ్ధిదారులు ఈ బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
అదే బియ్యం విదేశాలకు తరలిపోతోంది..
అదే సమయంలో మిల్లులో మర పట్టి క్వాలిటీ బియ్యం లో కలిపి విక్రయాలు చేస్తున్నారు.
ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున బియ్యం తరలిపోతున్న విషయం బయటపడింది.
గతం నుంచి ఆరోపణలు ఉన్నా.. సాక్షాత్ ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కలుగజేసుకొని ఆ బియ్యాన్ని పట్టుకున్నారు.
దీంతో ఇది సంచలనంగా మారింది. అందుకే పేదలకు బియ్యం బదులు నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
అదే జరిగితే సంచలనమే…!
దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.