నారద వర్తమానం సమాచారం
తొలి తరం దినపత్రికలు ప్రత్యేక గుర్తింపు
సుమారు 116 సంవత్సరాలుగా తెలుగు పత్రిక రంగంలో ఎప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కలిగి ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నలను పొందుతూ టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న పత్రిక ” ఆంధ్ర పత్రిక ” గా చెప్పుకోవచ్చు. 198వ సంవత్సరంలో కాశీనాధుని వెంకటేశ్వరరావు బొంబాయి నుంచి ఆంధ్ర పత్రికను వార పత్రికగా ప్రారంభించడం జరిగింది. అప్పట్లో బొంబాయిలో తత్వ బోధిని అనే ముద్రణాశాలలో ఈ ఆంధ్ర పత్రిక పేపర్ ని ముద్రణ వేయడం చేసేవారు . అనంతరం ఈ ఆంధ్ర పత్రిక ఆంధ్రుల జాతీయ పత్రిక అవతరించింది. అప్పట్లో ఆంధ్ర పత్రిక తొలి సంపాదకులుగా అవిటిపల్లి నారాయణరావు పనిచేశారు. అనంతరం ఈ పత్రికను బొంబాయి నుండి 1914లో కొన్ని మార్పులకు అనుగుణంగా మద్రాసు ( చెన్నై) కు మార్చడం జరిగింది. నాడు మద్రాసు నుండి వెలువడుతున్న నేపథ్యంలో ఈ పత్రిక వార పత్రిక నుండి దినపత్రికగా రూపు మారింది. దినపత్రిక మార్పు చెందిన ఆంధ్ర పత్రికకు చెన్నై నగరం కేంద్రముగా కాశీనాధుని నాగేశ్వరరావు సంపాదకులుగా పని చేశారు. ఈ పత్రిక దేశ స్వాతంత్ర ఉద్యమ కార్యక్రమాలను కథనాలను రాస్తూ భారత స్వాతంత్ర సాధనకు ఎంతో సహకారం అందించింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో భారతీయ జాతీయ పత్రికగా గుర్తింపు పొందిన ఆంధ్ర పత్రిక మిగతా జాతీయ పత్రికలతో పాటు దేశ స్వాతంత్ర్య పోరులో జూలు విదిలించింది. సింహముల గాండ్రించి స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాలకు అండగా నిలిచింది. నూతన స్వాతంత్ర్య ఉద్యమంలోకి నడిపించే విధంగా ఉత్సాహపూరిత సంపాదకీయాలను ఈ పత్రిక ప్రచురించేది. చరిత్ర సాంస్కృతి సాహిత్యంశాలతో ఈ పత్రిక నడిచింది. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కృష్ణా జిల్లాకు చెందిన వారు ఈయన ప్రాథమిక విద్యను ఆయన స్వగ్రామం లో ఆ తర్వాత కృష్ణా జిల్లాలోని బందరు గుంటూరు జిల్లా మరియు చెన్నై వంటి ప్రాంతాలలో బి ఏ వరకు చదువుకున్నారు. గడిచిపోయిన ఆనాటి రోజుల్లో తలనొప్పి జలుబు వంటి నొప్పులు వంటి వ్యాధులకు నివారణ కోసం అమృతాంజన్ కనిపెట్టారు. ఈయనే అమృతాంజన్ బామ్ కి అప్పట్లో ఎంతో పేరు ఉండేది. ఈ అమృతాంజన్ ప్రోడక్ట్ ద్వారా కూడా నాగేశ్వరరావు ఆర్థికంగా ఎదిగారు.
దేశభక్తితో సామాజిక బాధ్యత కలిగి ఓ పేపర్ ను ప్రారంభించి పేపరు ద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని భుజానమోస్తూ.. స్వాతంత్ర్య సాధనలో తన పత్రికను ఒక భాగంగా నిలిపారు. కాశీనాధుని నాగేశ్వరరావు ఎన్నో దానధర్మాలు కూడా చేశారు ఈయన వ్యక్తిత్వాన్ని బట్టి అడిగిన వారికి లేదనుకుంటా దానధర్మాలు చేసే విధానాన్ని చూసి కాశీనాధుణి, వారిని ఆ రోజుల్లో “విశ్వదాత ” అని పిలిచేవారు. 198లో ప్రారంభించబడిన ఆంధ్ర పత్రిక అప్పట్లో బొంబాయి నుంచి వెలువడిన ఒకే ఒక తెలుగు పత్రిక అంటే చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉండేది. కాశీనాధుని నాగేశ్వరరావు సాహసం అనేది తొలి తెలుగు జాతీయ పత్రికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగతా తెలుగు దినపత్రికల కంటే ముందుగా బీజం వేసింది. కాశీనాధ నాగేశ్వరరావుకి తెలుగు భాషపై అభిమానం ఎంతో ఎక్కువగా ఉండేది. ఈ భాషాభిమానంతోనే నాగేశ్వరరావు తమ నివాస ప్రాంతాన్ని నాడు తెలుగు పత్రికలకు కేరాఫ్ గా నిలిచిన చెన్నైకి మార్చుకున్నారు.
అప్పట్లో తెలుగులో దినపత్రిక అంటూ ఏదీ రాలేదు 198 నాటి నుండి ఇప్పటివరకు ఎన్నో పత్రికలకు వచ్చాయి పోయాయి. కానీ 116 ఏళ్ల చరిత్ర కలిగిన నాటినుండి నేటి వరకు చిన్న చిన్న అవంతరాలు ఎదురైనప్పటికీ నేటికీ నడుస్తున్న తెలుగు దినపత్రికలలో ఆంధ్ర పత్రిక అనేది ఓ ప్రత్యేక స్థానాన్ని రూపుదిద్దుకుంది . కాశీనాధుని నాగేశ్వరరావు చేతుల మీదుగా నడిపించి ప్రస్తుతం వేరే వారి సంపాదికత్వంలో నడుస్తున్న ఆంధ్ర పత్రిక తెలుగువారి జ్ఞానాభివృద్ధికి భాషాభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించింది. తెలుగు పత్రికల ప్రారంభించి తెలుగువారికి దేశానికి ఎన్నో సేవలు అందించారు కాశీనాధుని నాగేశ్వరరావు సేవను గుర్తించి అప్పట్లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి” కళా ప్రపూర్ణ” అనే బిరుదుని పొందారు. గాంధీ మహాత్ముని పిలుపుని అందుకొని కాశీనాధుని వారు 1930లో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నారు. సుమారు 65 ఏళ్ల వయసులో గాంధీజీ బాటలో నడిచి ఆరు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. అనంతరం మరికొన్ని సంఘటనలో కూడా నాగేశ్వరరావు జైలు జీవితం గడపవలసి వచ్చింది. ఒక పత్రికా సంపాదకులుగా తెలుగు భాషకు పుట్టిన దేశానికి సేవ చేసిన నాగేశ్వరరావును ప్రత్యేకంగా గుర్తించి ఆంధ్ర మహాసభ వారు 1923లో “దేశోద్ధారక” వంటి గొప్ప బిరుదును ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక విజయవాడలోని దుర్గా కళామందిరం కాశీనాధుని వారు కట్టించింది అని ఈతరం వ్యక్తులు చాలా వరకు తెలిసి ఉండకపోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరికొత్త తెలుగు రాష్ట్రముగా ఏర్పరిచిన నాయకులలో వారు ఒకరు
ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఒక పత్రిక సంపాదకులు అయినా కాశీనాధుని నాగేశ్వరరావు ఏప్రిల్ 1938లో కన్నుమూశారు దేశానికి రాష్ట్రానికి దిశా నిర్దేశం చేస్తూ గొప్ప పత్రిక సంపాదకులుగా పేరు సాధించి మంచి విలువలతో కూడిన జర్నలిజాన్ని చేసి జర్నలిస్టులు విధానాల్ని కాపాడుతూ తెలుగు జర్నలిజంలో ఒక గట్టి పునాదిరాయి లా ఆంధ్రపత్రికను నిలిపారు.
కాశీనాధుని నాగేశ్వరరావు నడిపిన ఈ పత్రికతో పోలిస్తే చరిత్ర అనేది ఏ పత్రికకు లేకపోయినా కొద్దిలో కొద్దిగా 192 లో ప్రారంభమైన ” కృష్ణా పత్రిక” ఆంధ్ర పత్రిక కు సరి సమానంగా పోల్చబడి చూపబడుతుంది. “కృష్ణాపత్రిక” కూడా మొదటి తరంలో “ఆంధ్ర పత్రిక “కు ముందునాటి పత్రిక అయినప్పటికీ ఆ రోజుల్లో “కృష్ణ పత్రిక” “ఆంధ్ర పత్రిక” లు ఒకేలా పనిచేశాయి. ఆ పత్రికలకు ఉన్న గౌరవస్థానం నాటికి నేటికి పెద్దగా ఇతర పత్రికలకు లేదు నిజంగా విలువలు కలిగిన జర్నలిజానికి అక్షరబద్ధంగా కట్టుబడి ఉన్న నాటి తెలుగు దినపత్రికల ఘన చరిత్ర ఇది……
Discover more from
Subscribe to get the latest posts sent to your email.