నారద వర్తమాన సమాచారం
నిఘానేత్రంలో పల్నాడు జిల్లా..గంజాయి మరియు నేరాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్…
పల్నాడు జిల్లా పోలీసు.
గంజాయి మరియు నేరాల నియంత్రణకు పల్నాడు జిల్లాలో డ్రోన్ల నిఘా ద్వారా పటిష్ట చర్యలు – ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
పల్నాడు జిల్లాను గంజాయి,మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎన్ఫోర్సెంట్ చర్యల్లో భాగంగా ప్రత్యేక కార్యాచరణతో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన ఎస్పీ
గంజాయి మరియు నేరాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
నరసరావు పేట పట్టణంలోని చిత్రాలయ సెంటర్,రైల్వే స్టేషన్,NRT బస్టాండ్,NRT బస్టాండ్ ఎదురుగా ఉన్న Hird కాలేజీ,BC కాలనీ ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇందులో భాగంగా ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో గంజాయి వినియోగం, విక్రయం జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను, నిశితమైన ప్రాంతాలను, బహిరంగ ప్రదేశాలను, ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి, నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గంజాయి వినియోగం, క్రయ విక్రయం, అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సీ హెచ్చరించారు.
విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు బానిసై మీ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.