నారద వర్తమాన సమాచారం
ఎయిడ్స్ పట్ల అవగాహనే ఆయుధం
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
వరల్డ్ ఎయిడ్స్ డే వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం పలనాడు జిల్లా కోసూరు మండలం దొడ్లేరులో ప్రదర్శన అవగాహన జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఈ సంవత్సరం థీమ్ మంచి మార్గంలో పయనిద్దాం అని పేర్కొన్నారు హెచ్ఐవి నిర్మూలన మనందరి బాధ్యతని అది అవగాహనతో సాధ్యమవుతుందన్నారు ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని నివారణ ఒక్కటే మార్గమని దాని నియంత్రించడం మన కర్తవమని ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు హెచ్ఐవి అంటే అదో భయంకరమైన వ్యాధి అనే అపోహను తొలగించాలన్నారు జలుబు దగ్గు షేక్ హ్యాండ్ ద్వారా హెచ్ఐవి వ్యాపించదని అసు రక్షిత లైంగిక సంభోగం హెచ్ఐవి సోకిన వ్యక్తి యొక్క రక్తం మరొకరికి ఇవ్వటం ద్వారా మాత్రమే వ్యాపిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భూలక్ష్మి ఆరోగ్య కార్యకర్త అనుపమ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.