నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా…
ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి
భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ V. సత్తి రాజు ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పి శ్రీ V. సత్తి రాజు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ శ్రీ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రసంగించారు.
భీమ్ రావ్ అంబేద్కర్ రాంజీ సక్పాల్ బీమా బాయ్ దంపతులకు 14వ సంతానంగా 1891 ఏప్రిల్ 14 న జన్మించారు.
అయితే బాల్యం నుండే ఆయన సామాజిక వివక్షలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఎలాగైనా ఉన్నత చదువులు చదువుకుని సామాజిక వివక్షలను రూపుమాపాలనే దృఢ సంకల్పంతో బొంబాయి నందు మెట్రిక్యులేషన్ విద్యను అభ్యసించారు.
బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ ఆర్థిక సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయం నందు ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్డీ పట్టాను సంపాదించారు.
అనంతరం బరోడా మహారాజు సంస్థానంలో మిలటరీ కార్యదర్శిగా ఉద్యోగం చేశారు.
ఆ సమయంలో కూడా సైనికుల చేత సామాజిక వివక్షకు గురయ్యారన్నారు.
నా దేశంలో ఎలాగైనా అంటరానితనం, సామాజిక వివక్షత ను సమూలంగా రూపుమాపాలనే ఉద్దేశంతో 1931 సంవత్సరంలో గాంధీ ని కలుసుకొని,స్వాతంత్ర సంగ్రామంలో పాలుపంచుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశాలకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ హాజరై, సామాజిక వివక్షతల గురించి ప్రసంగించి బ్రిటిష్ ప్రభుత్వం చేత ప్రత్యేక హక్కులను పొందగలిగారన్నారు.
స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలను అంబేద్కర్ కి అప్పటి భారత ప్రభుత్వం అప్పగించింది.
రాజ్యాంగ రచనలు అత్యంత ప్రామాణికంగా రచిస్తూ, బడుగు బలహీన వర్గాల వారికి తగిన హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి సామాజిక వివక్షతను రూపుమాపే ప్రయత్నం చేశారన్నారు.
అలాగే స్వాతంత్ర భారత దేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా తన సేవలను భారత జాతి నిర్మాణం కోసం అందించారు.
1956 డిసెంబర్ 6 తేదీన స్వర్గస్తులైనారు. కావున ఈరోజు మనం ఆయన వర్ధంతిని జరుపుకుంటూ దేశానికి చేసిన ఘనమైన సేవలను స్మరించుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో
అదనపు ఎస్పీ (ఏఆర్) తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
KVD రామారావు , వెల్ఫేర్ ఆర్ ఐ L.గోపీ నాథ్
జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.