నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ ఆధ్వర్యంలో 62వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.
ఈ రోజు(06.12.2024) కోడెల శివప్రసాదరావు స్టేడియం, నరసరావుపేట నందు అదనపు ఎస్పీ(ఏఆర్) V. సత్య రాజు , ఏఆర్ డిఎస్పీ G. మహాత్మా గాంధీ రెడ్డి హోంగార్డు RI S.కృష్ణ పర్యవేక్షణలో హోంగార్డు 333 P.సుధాకర్ పరేడ్ కమాండర్ గా పరేడ్(కవాతు)ను నిర్వహించడం జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలోని హోంగార్డులచే గౌరవ వందనం స్వీకరించి, పరిశీలన వాహనంపై పరేడ్(కవాతు)ను పరిశీలించడం జరిగింది.
తదనంతరం పరేడ్ కమాండర్ సారథిగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించి, ఫ్లటూన్ల(platoons) వారీగా హోంగార్డులు జిల్లా అధికారైన ఎస్పీ కి గౌరవ వందనం సమర్పించడం జరిగినది.
తదనంతరం నిన్నటి(05.12.2024)రోజున హోంగార్డులకు నిర్వహించిన వివిధ స్పోర్ట్స్ మరియు గేమ్స్ పోటీల్లో విజేతలైన హోంగార్డులకు ఎస్పీ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయడం జరిగినది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, షాట్ పుట్, లాంగ్ జంప్ మొదలగు విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించడం జరిగినది.
అదే విధంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలనుఎస్పీ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
అత్యవసర పరిస్థితులు, సంఘ విద్రోహశక్తుల అణచివేత, ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు పోలీస్ బలగాలతో పాటు సమానంగా ప్రజా రక్షణ, సమాజ శ్రేయస్సు కొరకు ముందుండి తమ సేవలను నిస్వార్థంగా ప్రజలకు అందజేయడంలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమైనది. అందుకే వీరిని
జాతి యొక్క నిస్వార్థ సేవకులు
అని సంబోధిస్తారు.1962 చైనా యుద్ధ సమయంలో భారతీయ సైన్యానికి వీరు అద్భుతమైన సేవలను అందించినారు.అప్పటి నుండి వీరిని పోలీస్ శాఖకు కూడా సహాయకులుగా నియమించినారు.
ఆర్గనైజేషన్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన హోంగార్డు వ్యవస్థ కొరకు ఎన్నో సంక్షేమ చర్యలు తీసుకుందని తెలియజేశారు.
ఉన్నతాధికారులు హోంగార్డ్స్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు హోంగార్డ్స్ తాలూక సంక్షేమాన్ని మెరుగుపరచాలని వారి తాలూక పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని ఎస్పీ తెలియజేశారు.
హోంగార్డ్స్ కుటుంబాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
పిల్లల పట్ల, మరియు కుటుంబం పట్ల శ్రద్ధను కనబరిచి వారి ఉన్నతికి తోడ్పాటును అందించాలని కోరారు.
పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డ్స్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని పూర్తి హెల్త్ చెకప్ కు ప్లాన్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
సమాజ శ్రేయస్సు, ప్రజారక్షణ కొరకు వీరు అందిస్తున్న అత్యుత్తమ సేవలకు వీరికి అభినందనలు తెలుపుతున్నాను. వీరి సేవలు వెలకట్టలేనివి, భవిష్యత్తులో కూడా మరిన్ని మెరుగైన సేవలు ప్రజలకు అందించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో అదనపు ఎస్పీ(ఏఆర్) V. సత్య రాజు డిఎస్పీ(ఏఆర్) G. మహాత్మా గాంధీ రెడ్డి AO (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) KVD రామారావు ఎస్బిసిఐ బండారు సురేష్ బాబు , హోంగార్డు ఆర్ఐ S. కృష్ణ వెల్ఫేర్ ఆర్ఐ గోపీనాథ్, అడ్మిన్ ఆర్ ఐ M. రాజా మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.