నారద వర్తమాన సమాచారం
కారంపూడి లో తూనికల కొలతల శాఖ అధికారుల దాడులు
అన్ని దుకాణాలు మూసేసిన యాజమాన్లు
వాణి సిల్క్ షో రూమ్ లో ఎమ్మార్పీ లేని దుస్తువుల అమ్మకాలు
వాణి సిల్క్ షో రూమ్ పై పదివేల రూపాయల జరిమాణం విధించిన అధికారులు
వాణి సిల్క్ షో రూమ్ లో ఎమ్మార్పీ లేని దుస్తులు కొనొద్దు అంటూ వెల్లడించిన అధికారులు
కారంపూడి పట్టణంలో శుక్రవారం సాయంత్రం తూనికల కొలతలు అధికారులు దాడులు జరిపారు. వీరి రాకతో .. పట్టణంలో అన్ని దుకాణాలు మూసివేశారు. వాణి సిల్క్ షోరూంపై దాడి చేసి.. దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల అధికారుల తనిఖీల్లో భాగంగా దుస్తులపై తయరిదారుల మ్యానుఫ్యాక్చరింగ్, ఎమ్మార్పీ ధరలు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ విధమైనటువంటి వాణి సిల్క్ షో రూమ్ లో ఎటువంటి గుర్తింపు లేని దుస్తువులు, క్వాలిటీ తక్కువగా ఉంటాయని కాబట్టి ప్రజలందరూ దుస్తులను కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు, ఎమ్మార్పీ, ధరలు సరిచూసుకొని.. కొనుగోలు చేయాలని ప్రజలకు అధికారులు సూచించారు. వాణి సిల్క్ షోరూమ్ యాజమాన్యం పై పదివేల రూపాయలు జరిమానం విధించినట్లు సత్తెనపల్లి ఇన్స్పెక్టర్ జాన్ సైదా తెలిపారు. వాణి సిల్క్ షో రూమ్ లో కంపెనీ గుర్తు, ఎమ్మార్పీ ధరలు లేని దుస్తులు వాణి సిల్క్ షో రూమ్ లో భారీ స్థాయిగా ఉన్నాయని వాటి అమ్మకాలు యాజమాన్యని హెచ్చరించామని తెలిపారు. కాబట్టి వాణి సిల్క్ షో రూమ్ లో మండల ప్రజలు ఎవరు కొని మోసపోవద్దు అంటూ అధికారులు తెలిపారు. కాబట్టి మండల ప్రజలందరూ గమనించాలని అధికారులు తెలిపారు. వాణి సిల్క్ షో రూమ్ లో అనుకోకుండా తనిఖీలు చేయడంలో ఇంత భారీ మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ లేని దుస్తువులు ఉంటాయని ఊహించలేదని.. ఆయన తెలిపారు. కాబట్టి ఇన్ని రోజులు వాణి సిల్క్ షోరూమ్ మండల ప్రజలని మ్యానుఫ్యాక్చరింగ్ గుర్తులేని దుస్తువులు, ఎమ్మార్పీ లేని ధరల దుస్తువులు అమ్మి ప్రజలను మోసం చేశారని ప్రజలు విమర్శిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.