నారద వర్తమాన సమాచారం
రాష్ట్రంలో జర్నలిస్టులకు రైల్వే పాసులను పునరుద్ధరించాల్సిన విషయం తన దృష్టిలో ఉందని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం సుముఖంగా నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ చెప్పారు
ఆదివారం ఉదయం ఉయ్యూరు మండలం రాజుపేట గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు
కార్యక్రమ నిర్వాహకులు రత్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ చిందా వెంకటేశ్వర్లు రాజు గృహంలో మంత్రిని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు కలిసి రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను వివరించారు
గత రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని జర్నలిస్టులకు రైల్వే కన్సిషన్ ఇవ్వటం లేదని చెప్పగా ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి హామీ ఇచ్చారు
అలాగే టోల్ గేట్ల వద్ద జర్నలిస్టులకు మినహాయింపు నివ్వాలని
గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,50,000/- జర్నలిస్టులకు రెట్టింపు చేసి
ఐదు లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు
ఈ సందర్భంగా సాంబశివ నాయుడు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మను శాలువాతో సత్కరించి యూనియన్ జ్ఞాపికను, వినతి పత్రాన్ని అందజేశారు
కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి
డి కోటేశ్వరరావు సభ్యులు వసంత్ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.