నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట.
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 78 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
నరసరావుపేట బరంపేట కు చెందిన దేవరపల్లి వెంకట శివారెడ్డి నూతల ప్రమీల అను ఆమె వద్ద భోజన హోటలు పెట్టుకొనుటకు గాను నాలుగు సంవత్సరాలు లీజుకు తీసుకొని 60 వేల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వగా, షాపు యజమాని అయిన ప్రమీల షాపులో పొయ్యి వెలిగించకూడదని ఇబ్బంది పెడుతుండగా ఫిర్యాదు షాపు ఖాళీ చేస్తాము, మేము ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వమని అడగగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది .
మేడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన మేడా భాగ్యలక్ష్మి కు SC,ST బ్యాక్ లాగ్ ఉద్యోగం ఇప్పిస్తామని నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన మొగిలి కోటేశ్వరరావు మధ్యవర్తిత్వంగా కుంభ వెంకట కోటయ్యకు 4,50,000/- లు ఇవ్వగా ఉద్యోగం ఇప్పించకుండా మరియు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఫిర్యాదు తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.
అచ్చంపేట మండలం సండ్ర తండా కు చెందిన భూక్య బాల ఆంజనేయులు నాయక్ డిగ్రీ చదివి ఇంట్లో ఖాళీగా ఉండగా చిలుకలూరిపేట కు చెందిన భూక్య శివశంకర నాయక్ ఉద్యోగం ఇస్తానని 10,00,000/- రూపాయలు తీసుకున్నట్లు ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు ఇవ్వమని అడగగా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని బెదిరిస్తున్నట్లు అందుకుగాను ఫిర్యాది ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
కారంపూడి గ్రామానికి చెందిన వచ్చా వెంకట నాగేశ్వరరావు 2024 ఏప్రిల్ నెలలో విజయవాడ కు ఫ్యామిలీతో వెళ్ళు సమయంలో 36 సవర్ల బంగారం బ్యాగు నందు పెట్టుకొని వెళ్లి, ఫిర్యాది విజయవాడ నుండి తన స్వగ్రామమైన పెదగార్లపాడు గ్రామానికి వచ్చి బ్యాగు తనిఖీ చేసుకోగా బ్యాగులో 10 సవర్ల బంగారం ఉండి 26 సవర్ల బంగారం ఎక్కడో పోయినట్లు, సదరు విషయమై చట్ట పరంగా చర్యలు తీసుకొని బంగారం వెతికించవలిసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఫిర్యాది ని 2019వ సంవత్సరంలో తన భర్తకు స్కిజో ప్రేనియా అను వ్యాధి ఉన్న విషయం అత్తమామలు దాచిపెట్టి వివాహం చేసినట్లు, వారికి బాబు పుట్టిన తరువాత ఫిర్యాదు భర్త మానసికంగా,శారీరకంగా హింసిస్తూ మూడు సంవత్సరాలు గల తన కొడుకును ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
గచ్చిబౌలి హైదరాబాద్ కు చెందిన ఫిర్యాదు చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలోని గ్రానైట్ క్వారీ ని మరియొక ఇద్దరు భాగస్వాములను కలుపుకొని 1,90,00,000/- కొనినట్లు అంతట ఫిర్యాదు కి తెలియకుండా మిగిలిన ఇద్దరు భాగస్వాములు క్వారి లో ఉన్న మిషనరీ లను తీసుకుని వెళ్లిపోయినట్లు అడుగుతుంటే చంపుతామని బెదిరిస్తున్నందుకు గాను
తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.
నరసరావుపేట బరంపేట కు చెందిన ఫిర్యాదు ధనలక్ష్మి చిట్ ఫండ్ నందు 15,00,000/- లు చిట్టి వేయించి పాట పాడిన తరువాత పల్లా నాయుడు బాబు(ఫిర్యాదు మేన మామ), చల్లా శ్రీనివాసరావు అనువారు సగం డబ్బులు ఇచ్చి మిగిలినవి నాయుడు బాబు మరియు శ్రీనివాసరావు తీసుకొని డబ్బులు అడుగుతుంటే కొడతామని బెదిరిస్తున్నందుకుగా ను తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి జీవించడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు మరియు దూర ప్రాంతాల నుండి వచ్చిన అర్జీ దారులకు దాతల సహాయంతో భోజన ఏర్పాట్లను చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.