నారద వర్తమాన సమాచారం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్,ఎం కృష్ణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం
న్యూ ఢిల్లీ :
కర్నాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ (92) మృతికి ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎస్‌ఎం కృష్ణ అసాధారణ నేత అని, జీవితాంతం ఆయన ఇతరుల కోసం పాటుప డ్డారని గుర్తు చేసుకున్నారు.
కర్నాటక సీఎంగా అందిం చిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని.. ఆయన అన్ని వర్గాల ప్రజల అభివృ ద్ధికి కృషి చేశారని అన్నారు. ప్రత్యేకంగా మౌలిక సదుపా యాల కల్పనపై ఎక్కువ శ్రద్ధ చూపేవారని పేర్కొన్నారు.
ఎస్‌ఎం కృష్ణలో గొప్ప పాఠకుడు, ఆలోచనాప రుడు ఉన్నారని ప్రధాని కొనియాడారు. అనేక సార్లు తాను ఆయనతో సమావేశ మయ్యానని గుర్తుచేసు కున్నారు.
ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సాను భూతి తెలుపు తున్నట్లు పేర్కొన్నారు.