నారద వర్తమాన సమాచారం
పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులకు పంచాయతీ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగినది…..
. ప్రణాళిక బద్ధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన
ప్రజల ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా వనరులను వినియోగం భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా మెరుగుపరచటే లక్ష్యంగా సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు అన్నారు బుధవారం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నిధులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ వారి ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులకు పంచాయతీ అధికారులకు శిక్షణ కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది . ఆరోగ్యవంతమైన గ్రామం పేదరికం లేని మెరుగైన జీవనోపాధి గ్రామం బాలహిత పంచాయితీలు నీటి సమృద్ధి గల గ్రామం పరిశుభ్రమైన మరియు పచ్చనైన గ్రామం స్వయం సమృద్ధి తో మౌలిక సదుపాయాల గల గ్రామం సామాజిక న్యాయం మరియు సామాజికంగా భద్రత కలిగిన గ్రామం సుపరిపాలన కలిగిన గ్రామం మహిళా స్నేహ పూర్వక గ్రామం తదితర అంశములపై శిక్షణ ఇవ్వడం జరిగింది శిఖా శాంసన్ ఆరోగ్య విస్తరణ అధికారి మాధవి ఐసిడిఎస్ సూపర్వైజర్ గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఏపీ ఎంఓ వెంకటేశ్వర్లు కృప వేణి పంచాయితీ సెక్రటరీలు తదితరులు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.