నారద వర్తమాన సమాచారం
నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు ఆరోగ్యం, సంపద, లక్ష్యంగా స్వర్ణాంధ్ర- 2047 విజన్ డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు నేడు ప్రజల ఎదుట ఆవిష్కరించ నున్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు అన్నదాతల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామనే హామీని ఇవ్వనున్నారు.
రవాణా రంగంలో సౌక ర్యాల కల్పన, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం వంటి విషయాల ను తెలియజేయనున్నారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు విజయవాడలో జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాలను సీఎం చంద్రబాబు విజయ వాడ ఇందిరాగాంధీ మున్సి పల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రజల ముందు ఉంచనున్నారు.
2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ కావాలనే విషయాన్ని వివరించనున్నారు. ప్రజలూ తమ కుటుంబం 2047 ఏడాది నాటికి ఎలా ఉండాలో ఒక ఆలోచన చేయాలని, విజన్ తయారు చేసుకోవాలని సీఎం చంద్రబాబు కోరనున్నారు.
1999లో విజన్- 2020 రూపొందించి అమలు చేసిన ఫలితమే ప్రస్తుత హైదరాబాద్ అభివృద్ధి అని స్పష్టం చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో విజన్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేసి, జిల్లా, మండల స్థాయిల్లోనూ పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు.
ఏపీలో 250 వర్క్‌స్టేషన్లు ఏర్పాటు ద్వారా ఎవరైనా పని చేసుకునే, నైపుణ్య శిక్షణ తీసుకొనే వీలు కల్పిం చనున్నారు. చదువుకున్న వ్యక్తులు, వర్చువల్‌గా పనిచేసే వారికి ఉద్యోగా లిప్పించి ప్రోత్సహిస్తారు.
సీఎం చంద్రబాబు సభ సందర్భంగా విజయవాడ లో ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్ళించారు బందరు రోడ్డులో పూర్తిగా వాహనాలు రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నాయని పోలీసులు చెప్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.