నారద వర్తమాన సమాచారం
సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్?
హైదరాబాద్:
సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ కు బన్నీ వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లోని నివాసం నుంచి ఆయనను పోలీ సులు తమ వాహనంలో పీఎస్ కు తీసుకెళ్లారు. నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసుల వాహనంలోకి ఎక్కారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ2గా ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
మరోవైపు, కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో బన్నీకి ఊరట లభించలేదు. ఇదే ఘటన లో సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు. థియేటర్ మేనే జర్, మరో సిబ్బంది ఇప్పటికే జైలుకు వెళ్లారు. బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.