పల్నాడు జిల్లా పోలీస్…
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు అమరుడైన వ్యక్తి పొట్టి శ్రీరాములు – పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్
అమరజీవి పొట్టి. శ్రీరాములు వర్ధంతి(ప్రతి సంవత్సరం డిసెంబర్ 15)ని ఆత్మార్పణ దినం గా ప్రకటిస్తూ జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
ఈ సందర్భంగా ఈరోజు(15.12.2024) జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పొట్టి. శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించిన ఎస్పీ , ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తన ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు.ఆంధ్రులకు ప్రాత:భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు అను పొట్టి శ్రీరాములు గొప్పతనాన్ని గురించి ఎస్పీ కొనియాడారు.
అకుంఠిత దీక్ష, నిస్వార్థం, ఏదైనా సాధించాలని పట్టుదల, కార్య దక్షత, అలుపెరుగని పోరాటం వంటి ఎన్నో సుగుణాలను అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నుంచి మనం నేర్చుకోవాలని, వాటిని అలవర్చుకొని మన లక్ష్యాలను చేరుకోవాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు ఏ ఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి ,నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వర రావు ,SB CI – 1 బండారు సురేష్ బాబు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.