నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు.
నేరాల నియంత్రణకు పల్నాడు జిల్లా లో డ్రోన్ ద్వారా పటిష్ట చర్యలు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్.
జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో, కష్టతరమైన మరియు నిర్జన ప్రదేశాలలో తప్పిపోయిన వ్యక్తుల కోసం మరియు అనుమానితులను గుర్తించడానికి ఈ డ్రోన్ కెమెరాలు చాల బాగా ఉపయోగపడతాయని, ప్రముఖుల పర్యటనల సమయంలో మరియు వివిధ కార్యక్రమాలలో తక్కువ సిబ్బందితో ఎక్కువ ప్రదేశాన్ని కవర్ చేసి ఆయా ప్రదేశాలలో ఎటువంటి సంఘటనలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
పల్నాడు జిల్లా నందు ముఖ్యంగా నాగార్జున సాగర్ పి.యస్ లిమిట్స్ ఎత్తిపోతల దత్త జయంతి,రెంటచింతల పి.యస్ లిమిట్స్ మంచికల్లు శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళు,గురజాల నందు జరుగుచున్న పాతపాటేశ్వరమ్మ తిరునాళ్ళు నందు ప్రత్యేక కార్యాచరణతో పల్నాడు జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది అని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు.
తిరునాళ్ళు నందు ముఖ్యంగా మంచికల్లు,గురజాల ఫాక్షన్ గ్రామాల నేపథ్యంలో గ్రూపుల మధ్య గొడవలు,చైన్ స్నాచింగ్, దొంగతనాల నియంత్రణకు మరియు నేరాలకట్టడికి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల దత్త జయంతి మరియు మంచికల్లు శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళు ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా ముగిసాయని తెలిపారు.
గురజాల నందు ప్రస్తుతం (చివరి రోజు) శ్రీ పాతపాటేశ్వరమ్మ తిరునాళ్ళు డ్రోన్ నిఘా లో ప్రశాంతంగా జరుగుచున్నది.
పల్నాడు జిల్లా నందు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి,నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్సీ తెలిపారు.
ముఖ్యమైన కార్యక్రమాలు మరియు తిరునాళ్ళు జరుగు సమయంలో పోలీసు సిబ్బంది విధులతో పాటు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నేరాల కట్టడికి ప్రయత్నిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.