నారద వర్తమాన సమాచారం
పల్నాడుజిల్లా
ఆస్తి కోసం తొడబుట్టిన అన్న,తమ్ముడుని చంపిన అక్క
నకరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలిరాజు(50)కు ముగ్గురు సంతానం….
కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిన పౌలిరాజు భార్య చనిపోయారు.
పౌలురాజు నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ,పక్షవాతంతో ఈ ఏడాది జనవరిలో మృతిచెందాడు.
పౌలురాజుకు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల సంతానం.
పెద్ద కుమారుడు గోపీకృష్ణ బొల్లాపల్లి మండలం బండ్ల మోటు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు.
రెండో సంతానం కుమార్తె కృష్ణవేణి,పెళ్లి భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది.
మూడో సంతానం దుర్గా రామకృష్ణ కుమారులిద్దరికీ వివాహాలయ్యాయి
కానీ వీరిని భార్యలు వదిలి పుట్టిళ్లకు వెళ్లిపోవడంతో మొత్తం ఆస్తిపై కన్నేసిన కూతురు
నిందితురాలికి నకరికల్లులో ప్రియుడు ఉన్నట్లు సమాచారం తెలిసింది.
కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుపై ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
కొన్ని రోజులుగా బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరుకి గోపికృష్ణ
ఈ నెల10న అన్న గోపికృష్ణకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్య చేసిన సోదరి
మరోవైపు తమ్ముడిని నవంబరు 26న కాల్వలో పడేసి చంపినట్లు సమాచారం.
ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మృతిచెందగా.. ఆ కుటుంబానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు సంతానం కొన్ని రోజులుగా ఘర్షణ
పడుతున్నారు.
ఇన్నాళ్లు అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందునా,ఆడబ్బు తనకే దక్కాలనే దురాశతో సోదరి ఏకంగా అన్న,తమ్ముడిని ఒకరికి తెలియకుండా మరొకరిని చంపేసినట్లు తెలిసింది…
ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం
హత్య కేసులో ఇంకా లభించని ఇద్దరి మృతదేహాలు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.