నారద వర్తమాన సమాచారం
నేడు టిపిసిసి ఆధ్వర్యంలో చలో రాజభవన్
హైదరాబాద్:
తెలంగాణలో రెండు ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి అధికార పార్టీ కాంగ్రెస్ నేడు టీపీసీసీ ఆధ్వ ర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం జరగనుంది.
పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానికి సంబంధించిన ఆరోపణలపై మరియు హింసతో అతులకుతుల మైన మణిపూర్ లో ఇప్పటివరకు పర్యటించని ప్రధాని నరేంద్ర మోడీ యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈరోజు గళం విప్పనున్నారు.
ఈ నిరసనల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నా రు.ఇందిరా పార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు.
అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అమెరి కాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తు న్నారు.
అవినీతి, మోసం, మనీలాం డరింగ్, మార్కెట్ మానిప్యు లేషన్ లాంటి అంశాలలో అదానీ దేశ ప్రతిష్టను దెబ్బ తీశారని తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు నిరస నల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా.. ఉద యం 11 గంటలకు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. ఈ సంద ర్భంగా నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది.
నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ నేతలు.. ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లనున్నా రు. ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.