నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలో ఆహార పదార్థాలపై అధికారుల నిఘా శూన్యం ఫుడ్ సేఫ్టీ అధికారుల పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఆహార పదార్థాల అమ్మకాలు నిర్వహించే హోటల్స్ పై రెస్టారెంట్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జానపాడు ప్రధాన రహదారిలోని ఒక హోటల్లో కొండమోడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి టిఫిన్ చేయగా ఫుడ్ పాయిజన్ కావడం హాస్పటల్ పాలవడం జరిగింది. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చెయ్యగా వారు మూడు రోజుల తర్వాత పట్టణానికి రావడం జరిగింది. సదరు ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించి సుమారు 20 రోజులు కావస్తుంది. హాస్పటల్ పాలైన వ్యక్తి గత 20 రోజులుగా ఫోన్ చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వ్యాపారస్తులకు కొమ్ముకోస్తున్నారా అంటూ 20 రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ తీసుకున్నప్పటికీ వాటికి సంబంధించిన విషయంలో ఎందుకు వాటిని బయటపడటం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అంటే అవినీతికి పాల్పడుతున్నారా వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారా…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.