నారద వర్తమాన సమాచారం
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ లు పంపిణీ చేసిన – ఆర్డీవో కె.మధులత
పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక వినుకొండ రోడ్డు లో ఉన్న రోటరీ కమ్యూనిటీ భవనంలో గురువారం నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఆర్డీవో శ్రీమతి.కె.మధులత,
రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ తాళ్ళ రాజా శేఖర్ రెడ్డీ,రోటరీ క్లబ్ అధ్యక్షులు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్,ట్రేజరర్ కట్టమురి ఆంజనేయులు, రోటరీ క్లబ్ పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ యస్.కె. జిలానీ మాలిక్, డైరక్టర్స్ జమ్ముల రాధాకృష్ణ, పాశం కృష్ణ రావు, మద్ది కిషోర్ శెట్టి,కాకుమాను రాఘవరావు,పోటు అచ్యుత్,రోటరీ సర్వీస్ ప్రాజెక్ట్ డైరక్టర్ మునిందర్ రెడ్డీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీమతి.కె.మధులత మాట్లాడుతూ. నరసరావుపేట రోటరీ క్లబ్ వారు పేద మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణి చెసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనందుకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. నరసరావుపేట రోటరీ క్లబ్ వారు ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మహిళలకు స్వయం ఉపాధికి పనికొచ్చే కుట్టు మిషన్ లు ఇవ్వడం, చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజంలో మహిళలు ఆర్దికంగా బలపడి స్వతంత్రులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వపాటు రోటరీ సంస్థ వొకటన్నారు. ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి, మరి ఎవరి పైన ఆధారపడవలసిన అవసరం లేకుండా చేసేందుకు ప్రభుత్వ లతోపాటు, రోటరీ సంస్థ ప్రయత్నిస్తుందని, ఇందుకోసం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందించ దగ్గ విషయనీ,ఇలాగే ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలను రోటరీ క్లబ్ వారు నిర్వహించాలన్నారు.
రోటరీ వక్తలు మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం ద్వారా 22 మందికి ఉచితంగా కుట్టు మిషన్ లు పంపిణీ చేయడం జరిగిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మహిళలకు అనేక రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే శిక్షణ కేంద్రాలను పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రాంతంలో ఏర్పాటు చేయాలని,మహిళలు స్వయం శక్తితో ఎదగాలనదే ప్రభుత్వాలతో పాటూ, రోటరీ చేయూత ఇస్తుందని, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రోటరీ కూడా కృషి చేస్తుందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు కుట్టు మిషన్ పంపిణీ చేసే ప్రోగ్రామ్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్డీవో వారికీ, ఈ ప్రోగ్రామ్ కు స్పాన్సర్ చేసిన బి.జి.ఆర్. మైనింగ్.అండ్.ఇన్ఫ్రా హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.