నారద వర్తమాన సమాచారం
విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ పరిశీలన చేసిన ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
రెండు దశల్లో అంగనవాడి స్కూల్ పిల్లలకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఉన్నత పాఠశాల పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి అంగన్వాడి కేంద్రాల నుంచి ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల వరకు అందరికీ ప్రభుత్వము హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తుంది మొదటి దశలో ఏఎన్ఎం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ లు అంగన్వాడి కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు స్క్రీనింగ్ చేస్తారు ఈ స్క్రీనింగ్ లో ఏవైనా సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే రెండో దశ స్క్రీనింగ్ కోసం దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్తారు అక్కడ వైద్యులు మరోసారి పూర్తి స్థాయిలో పరీక్షించి అవసరమైన మందులు ఇస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో పరిష్కరించని సమస్యలను ఉన్నత స్థాయి కేంద్రానికి పంపాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి అంటే డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ డైట్ సెంటర్ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది అందుకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుంది విద్యార్థుల్లో ఆరోగ్యపరమైన సమస్యలు ముందస్తుగా గుర్తించటానికి నిర్వహిస్తున్న హెల్త్ స్క్రీనింగ్ జరుగుతున్న తీరును ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ శుక్రవారం పరిశీలించారు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం గుడిపాడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైద్య సిబ్బంది చేపడుతున్న ఆరోగ్య పరీక్షలు స్క్రీనింగ్ వివరాలు రికార్డుల్లో తనఖీ చేసి ఆన్లైన్ నమోదు తీరును ఆయన పరిశీలించారు స్క్రీనింగ్ కు అవసరమైన పరికరాలు, కిట్లు సిద్ధంగా ఉన్నాయా ఆరోగ్య నివేదికలు కచ్చితంగా నమోదు చేస్తున్నారా? మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఇప్పటివరకు ఎంతమందికి స్క్రీనింగ్ పూర్తి చేశారు వారిలో ఆరోగ్య సమస్యలు వ్యాధులు, వైకల్యం, పుట్టుక లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఎంతమందిని గుర్తించారు, వైద్యాధికారి ఎంతమందికి చికిత అందజేశారు, ఎంతమందిని దగ్గర్లో ఉన్న పీహెచ్సీ లేదా ఉన్నత ప్రభుత్వ ఆసుపత్రికి లేక డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ కు రెఫర్ చేశారు మొదలగు వివరాలను పరిశీలించారు స్క్రీనింగ్ పారదర్శకంగా నిర్వహిస్తున్నారా లేదా అని అక్కడ కొంతమంది విద్యార్థులకు స్క్రీనింగ్ చేయించి నివేదికలు పరిశీలించారు స్టూడెంట్స్ సిక్ రిజిస్టర్ గూర్చి అడిగారు వైద్య, ఉపాధ్యాయ సిబ్బంది సమన్వయంతో విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్కు కు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ దివ్య, ఆరోగ్య కార్యకర్త ఝాన్సీ, ఆశా కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.