నారద వర్తమాన సమాచారం
తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదు..
తిరుమల పవిత్ర క్షేత్రం.
ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగింది.
తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నాం.
తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేదేలేదు.
తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం.
అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నాం.
— బి.ఆర్.నాయుడు, టీటీడీ ఛైర్మన్
గంటలో తిరుమల శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు.
ఇందుకోసం భక్తుల ఆధార్, ఫొటో తీసుకుని దర్శనం సమయం సూచించే టోకెన్ ఇస్తారు. ఆ సమయానికి వచ్చే భక్తులను దర్శనం కోసం నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి పంపుతారు. సక్సెస్ అయితే 45 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.